Shalini Pandey: అర్జున్ రెడ్డి భామ ఇంత‌లా మారిపోయింది.. ఈ అమ్మ‌డి లుక్స్ చూసి ఆశ్చ‌ర్యపోతున్న ఫ్యాన్స్

Shalini Pandey: అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ సినిమాలో షాలిని ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా కాని వారు లేరు. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన షాలినీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లో కనిపించింది. ఇందులో కూడా షాలిని పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

Shalini Pandey Latest Black Outfit
Shalini Pandey Latest Black Outfit

మొదటి సినిమానుంచి బొద్దుగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. సినీ అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని టాక్ వస్తున్న నేపథ్యంలో స్లిమ్‌గా మారిన షాలిని పాండే క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుంది.

Shalini Pandey Latest Black Outfit
Shalini Pandey Latest Black Outfit

షాలిని పాండేకి యువతలో మంచి క్రేజ్ లభించింది. నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ నటనతో కూడా మెప్పించింది. తాజాగా షాలిని పాండే బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని థైస్, నడుము అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

Shalini Pandey Latest Black Outfit
Shalini Pandey Latest Black Outfit

షాలిని బెల్లీ అందం గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. ఇంత అందాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్దులు అవుతున్నారు. ఆమె క్యూట్ లుక్స్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం షాలిని పాండే క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

షాలిని న‌టించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది.