Shakuntalam Movie: లక్కుతోక తొక్కిన సమంత.! ‘శాకుంతలం’ సినిమాకి అదే అడ్వాంటేజ్.!

NQ Staff - September 24, 2022 / 02:31 PM IST

Shakuntalam Movie: లక్కుతోక తొక్కిన సమంత.! ‘శాకుంతలం’ సినిమాకి అదే అడ్వాంటేజ్.!

Shakuntalam Movie: సమంత అదృష్టం మామూలుగా వున్నట్లు లేదు. ఎందుకంటారా.? ఆమె నటించిన పౌరాణిక నేపథ్యమున్న మూవీ ‘శాకుంతలం’ నవంబర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. లేటెస్టుగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు మేకర్లు.

నవంబర్ 4న ‘శాకుంతలం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా నవంబర్ మంత్‌ని డ్రై మంత్‌గా అభివర్ణిస్తుంటారు. ఆ నెలలో పెద్దగా సినిమాల రిలీజ్‌లకు ప్లాన్ చేసే సాహసాలు చేయరు. కానీ, సమంతతో ఆ సాహసం చేయిస్తున్నారు ‘శాకుంతలం’ టీమ్.

సమంత లక్కు ఎలా వుందో.!

అయితే, నయా ట్రెండ్‌లో సినిమాల ఈక్వేషన్స్ బొత్తిగా మారిపోయాయ్. సినిమా బాగుంటే, అంటే, కంటెంట్ బాగుంటే, ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు కటౌట్‌తో సంబంధం లేకుండా. కంటెంట్ బాగోలేకపోతే, ఎంత పెద్ద కటౌట్ వున్నా, ఆఖరికి మెగాస్టార్ సినిమా అయినా తొక్కి పడేస్తున్నారు.

Shakuntalam Movie Screens On November 4

Shakuntalam Movie Screens On November 4

సో, డ్రై మంత్ అనే సెంటిమెంట్‌తో సంబంధం లేకుండా, ‘శాకుంతలం’తో సమంత ఆడియన్స్‌ని కట్టిపడేయగలిగితే, సమంత లక్కు తోక తొక్కినట్లే. సినిమా పెద్ద హిట్ అయిపోతుంది.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మహాభారతంలోని ఆది పర్వం, అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించారు. శకుంతల, దుష్యంతుల ప్రేమగాధ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి అన్నీ కలిసొస్తే, డ్రై మంత్‌ని సైతం ఎదుర్కొని గట్టెక్కేసే అవకాశం వుందనేది సినీ మేథావుల అభిప్రాయం. ఏం జరుగుతుందో చూడాలి మరి. లేకపోలేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us