Shakeela Eliminated From Bigg Boss House : బిగ్ బాస్ నుంచి షకీలా ఎలిమినేషన్.. సన్ డే సాదాసీదాగానే..!
NQ Staff - September 18, 2023 / 10:07 AM IST

Shakeela Eliminated From Bigg Boss House :
బిగ్ బాస్ సీజన్-7 అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఆదివారం ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా.. కానీ బిగ్ బాస్ మొన్నటి వరకు అన్ని రోజులు కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగింది. ఇక ఆదివారం అయితే ఎలిమినేషన్ అనేది కచ్చితంగా ఉంటుందని మనకు తెలిసిందే కదా. అయితే ఆదివారం నాగార్జున వచ్చి ఏదో ఫన్ జనరేట్ అయ్యేలా చేస్తాడని అంతా అనుకుంటారు. కానీ ఆదివారం ఏమంత మజాగా సాగలేదు. సండే ఫన్ డే అనే కాన్సెప్ట్ ను సాదాసీదాగా జరిపించేశాడు నాగార్జున. శనివారం అందరికీ క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. శివాజీ, గౌతమ్ కృష్ణకు ఎక్కువగా వార్నింగ్ లు ఇచ్చేశాడు.
ఇక రెండో వారం పవర్ అస్త్రను శివాజీ గెలుచుకున్నాడు. ఆట సందీప్ ఆ పవర్ అస్త్రను శివాజీకి ఇచ్చేశాడు. ఇక ఆదివారం నాడు నాగార్జున వచ్చి మీ తోటి కంటెస్టెంట్లలో బాహుబలి ఎవరు, కట్టప్ప ఎవరు అని అందరినీ పిలిచి అడిగాడు. అందుకు ఒక్కొక్కరు వచ్చి తమ బాహుబలి, కట్టప్పలను చెప్పేశారు. అందుకే ఎవరి కారణాలు వారు చెప్పారనుకోండి. ఇలా సాదా సీదాగా సాగిస్తూ అక్కడక్కడ కాస్త ఫన్ జనరేట్ అయింది. అంతే తప్ప అంతకు మించి పెద్దగా ఎంటర్ టైన్ మెంట్ మాత్రం జరగలేదు. సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్ అంటే అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు.
ఈ విషయం బిగ్ బాస్ కు కూడా తెలుసు. అలాంటి వారిని ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త కాన్సెప్టులను వెతుక్కోకుండా ఏదో చేశాం లే అన్నట్టు ఆదివారం ఎపిసోడ్ ను జరిపించేశారు. ఇక అందరూ ఊహించినట్టే ఎలిమినేషన్ కూడా జరిగింది. షకీలాను హౌస్ నుంచి పంపించేశారు. దాంతో ఇక్కడ అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే షకీలా హౌస్ లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఎవరికి గొడవలు వచ్చినా సరే కలిపేందుకు ప్రయత్నించేది. దాంతో ఆమె అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉంది. ఆమె వెళ్లిపోతుంటే అమర్ దీప్ ఏడ్చేశాడు.
అటు టేస్టీ తేజ కూడా బాధపడ్డాడు. ఇలా హౌస్‍లోని ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఇంట్రస్టింగ్‍గా అనిపించింది. దామిని పాట పడి.. షకీలాను ఏడ్పించింది. ఇది మాత్రం ప్రేక్షకులను కాస్త కట్టిపడేసింది. ఇది ఒక్కటి మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగిందని చెప్పుకోవాలి. కానీ గత వీకెండ్ ఎపిసోడ్ తో పోలిస్తే ఇదేమంత స్పెషల్ గా అనిపించలేదు. అందుకే దీన్ని అందరూ ట్రోల్స్ చేస్తున్నారు.
మీమర్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఇక సోమవారం మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలు కాబోతోంది. ఆ రోజు కాస్త రచ్చ రచ్చగా ఉంటుందని తెలిసిందే. చూడాలి మరి ఈ సారి ఎవరెవరు నామినేషన్స్ లో ఉంటారనేది.