Samantha: స‌మంత‌ను మెచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో.. కార‌ణం ఏంటో తెలుసా?

Samantha: అక్కినేని కోడ‌లు సమంత‌ను మెచ్చ‌ని వారు ఉండ‌రు. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన స‌మంత మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటుకుంది. అయితే గత కొద్ది రోజులుగా సమంత పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. సమంత, నాగచైతన్య మధ్య గొడవలు జరుగుతున్నాయని.. త్వరలోనే విడిపోనున్నారని వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఎన్ని వార్త‌లు వ‌చ్చినా అవేమి ప‌ట్టించుకోకుండా స‌మంత ట్రిప్స్‌తో స‌ర‌దాగా గ‌డుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ..గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే తమిళంలో కూడా ఓ మూవీ చేస్తుంది.

స‌మంత టాలెంట్‌కు సౌత్‌, నార్త్ ఆడియ‌న్స్‌, సెల‌బ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్. రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో పాల్గొన్నాడు షాహిద్. ఈ సందర్భంగా ‘ది ఫ్యామిలీ మెన్ 2’ లో సమంత యాక్టింగ్ గురించి తన ఒపీనియన్ చెప్పాలని ఫ్యాన్స్, షాహిద్‌ను అడిగారు.. దీనికి షాహిద్ రెస్పాండ్ అవుతూ.. ‘ఫ్యామిలీ మెన్ 2 లో సమంత యాక్టింగ్‌కి ఫిదా అయ్యానని చెప్పాడు. అంతేకాదు తనతో కలిసి నటించాలనుందనే కోరికను కూడా బయటపెట్టాడు.

రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నెగిటివ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వ‌ల‌న‌నే చైతూకి- సామ్‌కి మ‌ధ్య విబేధాలు త‌లెత్తాయ‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.