Shah Rukh Khan: జైల్లో ఉన్న కుమారుడిని క‌లిసి షారూఖ్‌.. భావోద్వేగానికి గురైన కుమారుడు

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ముంబై క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో అక్టోబర్ 2వ తేదీన అరెస్టు కాగా, అప్పటినుండి ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారూఖ్ చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు.

మూడోసారి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ ను కలవడానికి షారూఖ్ ఖాన్‌ జైలుకు వెళ్లారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత ఆర్యన్ ఖాన్ ని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లడం ఇదే మొదటిసారి. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్ ఖాన్ తీవ్ర మనస్థాపంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆర్యన్ ఖాన్ జైలు ఖైదీలతో కలిసి ఒకే బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ ఉంటున్నట్టు, జైలు నుండి ఆర్యన్ ఖాన్ ఉన్న బ్యారక్ నుండి సోమవారం విడుదలైన శ్రవణ్ నాడార్ అనే వ్యక్తి ఆర్యన్ ఖాన్ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.100 మంది ఖైదీలు ఉన్న బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ వాళ్లతో కలిసి ఉంటున్నట్టు వెల్లడించారు. కేవలం పది ఫ్యాన్లు, నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండే ఆ గదిలో ఉంటున్నారని చెప్పాడు.

జైలు ఆహారాన్ని తీసుకోవడం లేదని, కేవలం బిస్కెట్లు, చిప్స్ మాత్రమే తింటున్నాడు అని, జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని ఇతర ఖైదీలకు ఇస్తున్నాడని వెల్లడించారు. ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు ముంబై డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని గురువారం నాడు బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు.

ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) కోర్టు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు .నవంబర్ 4 వ తేదీన దీపావళి కావడంతో నవంబర్ మొదటి వారంలో కోర్టులకు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారానికి ముందు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోతే, అతని జైలు జీవితం మరింత పొడిగించబడుతుంది. దీపావ‌ళి వ‌రకు అయిన ఆర్య‌న్ వ‌స్తాడా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.