DHEE: డ్యాన్స్ ఢీ షోలో విషాదం.. ఆ కంటెస్టెంట్ కు తీవ్ర గాయాలు

DHEE గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ ఛానెల్ నిరంతరంగా నడిపిస్తున్న ఎన్నో ఎంటర్ టైనింగ్, రియాలిటీ షోలు ఉన్నాయి. ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకునే షో ప్రముఖ రియాలిటీ డాన్స్ షో ఢీ. ఈ ప్రోగ్రామ్ తో ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు సక్సెస్ సాధించి కెరీర్ ని ఆనందమయం చేసుకుంటున్న వారు ఉన్నారు. జీవితంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం వాళ్ళల్లో ఉన్న ప్రతిభని నమ్ముకుని ఢీ స్టేజ్ పై నిరూపించుకున్నవారు ఉన్నారు. అలాంటి అల్టిమేట్ టాలెంట్ షో ఎలాంటి బ్రేకులు లేకుండా కొనసాగుతూనే ఉంది.

ఈ షోలో విజేతగా నిలిచినవారెందరో సినిమాలో ప్రముఖ స్టార్స్ కి కొరియోగ్రాఫర్లుగా సెటిల్ అయ్యి తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఈ ఢీ షో ఇప్పటివరకు పన్నెండు షోలు పూర్తి చేసుకుని 13 వ సీజన్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. అయితే కంటెస్టెంట్లు తమ టాలెంట్ ని జడ్జెస్ ముందు ప్రేక్షకుల ముందు ప్రదర్శించాలనే ఉత్సాహంతో కష్టతరమైన ఫీట్లను వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ లేడి కంటెస్టెంట్ ప్రమాదానికి గురయ్యారు. దీనికి సంబంధించి ఓ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ ప్రోమోలో డాన్స్ చేస్తూ ఓ కంటెస్టెంట్ సడెన్ గా స్టేజ్ కింద పడిపోయింది. దీంతో తలకు పెద్ద గాయం అవ్వడం. అందరూ రావడం ఈ ప్రోమోలో చూపించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. నిపుణుల పర్యవేక్షణలోనే డాన్స్ ఫీట్స్ నిర్వహిస్తున్నా.. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. డాన్స్ చేస్తూ కిందకు దూకే ఓ షాట్ లో కంటెస్టెంట్ కింద పడటంతో ఆమె తలకు రక్తస్రావమైంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. అసలు ఇది నిజమైన ప్రమాదేమేనా లేదంటే స్టంట్ కోసం ప్రోమోను రిలీజ్ చేసారా అనేది తెలియాలంటే నెక్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాలకు తావు లేకుండా రియాలిటీ షోస్ కండెక్ట్ చేయాలని నెటిజన్లు భావిస్తున్నారు.

Advertisement