Actress: మాస్క్ పెట్టుకున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టగలరా.. ఫుల్ ఫేమస్..!
Samsthi 2210 - July 31, 2021 / 01:12 PM IST

Actress: ఇక్కడ మాస్క్ పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఒక్కసారి కనిపెట్టండి చూద్దాం..? ఈమె అంటే తెలియని వాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా లేడీస్ లో ఈమెకున్న ఫాలోయింగ్ కొలవడానికి ఏ కొలమానం కూడా సరిపోదేమో..? అంతగా ఇమేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

Serial Actress Prema Vishwanath Pic
ఫోటోను తీక్షణంగా చూస్తుంటే ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కదా..? అవును మీరు ఊహించింది కరెక్టే.. ఈ భామ ఎవరో కాదు మన వంటలక్క ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లో గంగను ఉప్పొంగిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సీరియల్ కు ఉన్న పాపులారిటీ గురించి చెప్పడం అంటే ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిదే.
ఎన్ని సీరియల్స్ ఉన్నా కూడా సాయంత్రం 7.30 అయిందంటే చాలు అన్ని ఇళ్ళలో కూడా రిమోట్ మా టీవీ వైపు వెళ్లాల్సిందే. లేదంటే చిన్న సైజ్ యుద్ధాలు జరుగుతాయంతే. అలాంటి ఇమేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం సీరియల్. అందులో మెయిన్ రోల్ పోషిస్తుంది ప్రేమీ. కేరళ కుట్టి అయినా కూడా మన దగ్గర ఈమెకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Serial Actress Prema Vishwanath Pic
ఈ ఒక్క సీరియల్ తోనే అమ్మడి క్రేజ్ ఆకాశాన్ని దాటిపోయింది. తరుచూ హైదరాబాద్ నుంచి కేరళకు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటుంది వంటలక్క. అలా తీసుకున్న ఫోటోనే ఇది. ఎయిర్ పోర్టులో దిగి దిగగానే మాస్క్ పెట్టుకుని అలా ఫోటోకు పోజిచ్చింది వంటలక్క. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ అయిపోయింది.
తాజాగా ఈ అమ్మడు సరికొత్త సీరియల్‌కి సైన్ చేసినట్టు తెలుస్తుంది. దేవికా అని, సోమవరం (జూలై 5) నుంచి రాత్రి 8 గంటలకు సూర్య టీవీ ప్రసారం అవుతున్నట్లు వంటలక్క తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ సీరియల్‌లో సరికొత్త లుక్‌లో కనిపించి అలరించనుంది.