Prema: ఆ స్టార్ హీరోయిన్ రెండో పెళ్లికి సిద్ధ‌మైందా..?

Prema: మొన్న సింగర్ సునీత, నిన్న సురేఖ వాణి, ఈరోజు సీనియర్ హీరోయిన్ ప్రేమ.. ఇలా ఒకరి తర్వాత మరొకరికి సంబంధించిన రెండో పెళ్ళి గురించి కథనాలు దావానంలా వస్తున్నాయి. సింగర్ సునీత ఇటీవల కాలంలో ప్రముఖ వ్యాపార వేత్తను రెండో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత సురేఖ వాణి కూడ త్వరలో రెండో పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ నిజాలు కావని, తనకు రెండో పెళ్ళి చేసుకునే అభిప్రాయం లేదని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు.

Senior Actress Prema Ready for Second Marriage
Senior Actress Prema Ready for Second Marriage

ఈ క్రమంలో సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లికి రెడీ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని.. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతుంది అంటూ పోస్టులు వచ్చాయి. ప్రేమ 2006 లో ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్ళి చేసుకున్నారు. అయితే కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి బంధంలో విభేదాలు రావడంతో 2016 లో విడిపోయారు.

ప్రస్తుతం ప్రేమ కూడా రెండో పెళ్ళి చేసుకుంటుంది అని వార్తలు రావడంపై ప్రేమ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. తనకు రెండో పెళ్ళి చేసుకునే అభిప్రాయం లేదని అన్నారు. అలాగే తన ఆరోగ్యం కూడా సవ్యంగా ఉందని పేర్కొన్నారు.

Senior Actress Prema Ready for Second Marriage
Senior Actress Prema Ready for Second Marriage

హీరోయిన్ గా ప్రేమ కన్నడ, తమిళం, మలయాళం తో పాటు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన సవ్యసాచి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ కి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆమె మోహన్ లాల్, విష్ణు వర్ధన్, వెంకటేష్, జగపతి బాబు, రవిచంద్రన్, మోహన్ బాబు, సాయి కుమార్ లాంటి టాప్ స్టార్ హీరోల సరసన నటించింది.

పెళ్లి తర్వాత సినిమాలలో నటించడం మానేశారు. ఆమె విడాకుల తర్వాత 2017 లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో ప్రేమ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.