Senior Actor Ashish Vidyarthi : 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి లవ్ మ్యారేజ్.. కూతురు వయసున్న అమ్మాయితో..!

NQ Staff - May 26, 2023 / 12:20 PM IST

Senior Actor Ashish Vidyarthi : 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి లవ్ మ్యారేజ్.. కూతురు వయసున్న అమ్మాయితో..!

Senior Actor Ashish Vidyarthi  : సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. తెలుగులో ఎక్కువగా విలన్ పాత్రల్లోనే మెప్పించారు. కాగా ఆయన 60 ఏండ్ల వయసులో అందరికీ షాక్ ఇచ్చే పని చేశారు.

కూతురు వయసున్న 33 ఏండ్ల అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. షష్టి పూర్తి జరుపుకోవాల్సిన వయసులో పెండ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఆశిష్ విద్యార్థికి రాజోషి బారాతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సంతానం కూడా. అయితే విభేదాల కారణంగా ఆశిష్ విద్యార్థి ఆమెతో విడిపోయారు.

Senior Actor Ashish Vidyarthi Got Married Rupali

Senior Actor Ashish Vidyarthi Got Married Rupali

అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయన కొంత కాలంగా కోల్ కత్తా లోని గౌహతికి చెందిన రూపాలితో ప్రేమలో ఉన్నారు. ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ అతికొద్ది మంది కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరూ సంప్రదాయ బట్టల్లో దండలు మార్చుకున్నారు.

ఇప్పటికే నరేశ్ పవిత్ర పెండ్లి హంగామా జరుగుతున్న సమయంలో మళ్లీ పెళ్లి అనే ట్రెండ్ ను ఆశిష్ విద్యార్థి కంటిన్యూ చేసినట్టు అయింది. ఇక నటుడిగా ఆయన తెలుగులో రైటర్ పద్మభూషన్ సినిమాలో చివరగా నటించారు. దీని తర్వాత కూడా ఆయనకు మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us