Sekhar Master : శేఖర్ మాస్టర్ తో కన్నీళ్లు పెట్టించిన ఓంకార్ అన్నయ్య
NQ Staff - September 30, 2022 / 09:23 AM IST

Sekhar Master : ఓంకార్ షో అంటేనే ఎమోషనల్ గా ఉంటుంది, ఇక ఆయన డాన్స్ కార్యక్రమం లేదా మరేదైనా కార్యక్రమం నిర్వహించిన కంటెస్టెంట్స్ తో పాటు జడ్జ్ లు కూడా ఒకానొక సందర్భముగా ఎమోషనల్ అవుతూనే ఉంటారు.
తాజాగా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఒక కంటెస్టెంట్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత తన తండ్రి స్టేజ్ పైకి రావడంతో తండ్రిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
పుట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడూ తన తండ్రిని హగ్ చేసుకోలేదని, పండగలకు ఎవరెవరినో హగ్ చేసుకున్నాను కానీ.. తన తండ్రిని మాత్రం హగ్ చేసుకోలేక పోయాను అంటూ ఆ కంటెస్టెంట్ చెప్పుకొచ్చాడు.
స్టేజిపై తండ్రిని హగ్ చేసుకున్న అతడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరి గుండె కరిగినంత పని అయింది. శేఖర్ మాస్టర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. తనకు కూడా తండ్రిని హగ్ చేసుకోవాలని ఉందని.. కానీ ఆ అదృష్టం నాకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఓంకార్ మాస్టర్ వద్దకు వెళ్లి మీకు తండ్రి లేడు నాకు తండ్రి లేడు.. మీకు నేను, నాకు మీరు అంటూ ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఎపిసోడ్ ఈ వారం స్ట్రీమింగ్ కి రెడీగా ఉందంటూ ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. డాన్స్ ఐకాన్ కార్యక్రమంలో రమ్యకృష్ణ, మోనాల్ లు కూడా జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనకు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.