Seetimaarr : సీటీమార్ సినిమాతో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న గోపీచంద్.. టైటిల్ సాంగ్ అలా ఉంది మరి.!

Seetimaarr : సీటీమార్ సినిమాతో యాక్షన్ హీరో గోపీచంద్ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వ వహించాడు. క్రీడా నేపథ్యంలో రూపొందిన సీటిమార్.. కబడ్డీ ఆట చుట్టూ కథ సాగుతుందని సమాచారం. గోపీచంద్ – తమన్నా ఈ సినిమాలో కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. రీసెంట్ గా సీటిమార్ టీజర్ ని రిలీజ్ చేయగా అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

seetimaarr-movie-is-also-going-to-get-a-block-buster-hit-as-krack
seetimaarr-movie-is-also-going-to-get-a-block-buster-hit-as-krack

టీజర్ తో సీటీమార్ సినిమా మీద అంచనాలు భారీగా పెరగగా తాజాగా సీటిమార్ టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో సీటిమార్ టైటిల్ ట్రాక్ ట్రెండింగ్ అవుతోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా కాసర్ల శ్యామ్ సాహిత్యం అదిరిపోయింది. దాంతో తాజాగా రిలీజైన ఈ టైటిల్ ట్రాక్ విన్న సినీ ప్రముఖులు గత కొంతకాలంగా గోపీచంద్ ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ సీటీమార్ సినిమాతో దక్కబోతోంది అంటూ అభిప్రాయపడుతున్నారు.

Seetimaarr : సీటీమార్ టైటిల్ సాంగ్ గోపీచంద్ కి భారీ ఇవ్వడం పక్కా అని మాట్లాడుకునేలా చేస్తోంది.

మాస్ మహారాజ రవితేజ గత మూడేళ్ళ నుంచి వరసగా ఫ్లాప్స్ చూశాడు. అయితే రీసెంట్ గా సంక్రాంతి బరిలో దిగి క్రాక్ సినిమాతో ఊహించని సక్సస్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఫుల్ ఫాం లోకి వచ్చిన రవితేజ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని కమిటవుతున్నాడు. అదే ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ విషయంలో కూడా రిపీటవబోతోందంటూ చెప్పుకుంటున్నారు. మొత్తానికి తాజాగా రిలీజైన సీటీమార్ టైటిల్ సాంగ్ గోపీచంద్ కి భారీ ఇవ్వడం పక్కా అని మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement