Seetimaar: కూత గ‌ట్టిగానే ఉంది.. రెండో రోజు భారీగా వ‌సూళ్ల వర్షం

Seetimaar: మాచో హీరో గోపిచంద్‌కి ఈ మ‌ధ్య కాలంలో స‌క్సెస్ రాలేదు. తాజాగా సీటీమార్ అనే చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ప‌లువురు హీరోల‌ని దాటుకుంటూ ఈ సినిమా క‌థ‌ గోపిచంద్ ద‌గ్గ‌ర‌కు రాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం హిట్ టాక్‌ను అందుకుంది.

Seetimaar movie 2nd day Box Office Collections
Seetimaar movie 2nd day Box Office Collections

గోపీచంద్, తమన్నా కాంబోలో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ‘సీటీమార్’. దీనిని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది


సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వస్తుంది. గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాల్లో సీటీమార్ కూడా నిలిచింది. తొలిరోజు ఈ చిత్రానికి అన్ని చోట్ల బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్టు కాగా, మ‌రో 7.05 కోట్ల క‌లెక్ష‌న్స్ ఈ చిత్రం రాబ‌ట్టాల్సి ఉంది.


నిజాం- 45 ల‌క్ష‌లు
సీడెడ్- 36 ల‌క్ష‌లు
యూఎస్ఏ- 22 ల‌క్ష‌లు
గుంటూరు- 14 ల‌క్ష‌లు
ఈస్ట్‌- 17 ల‌క్ష‌లు
వెస్ట్ – 10 ల‌క్ష‌లు
కృష్ణ‌- 9 ల‌క్ష‌లు
నెల్లూరు- 8 ల‌క్ష‌లు


ఏపి- తెలంగాణ‌లో రెండో రోజు 1.61 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. రెండు రోజుల‌కు గాను ఈ చిత్రం 4.95 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాకు 11.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడ సినిమాను విడుదల చేయలేదు నిర్మాతలు. కేవలం ఇండియాలోనే తమ సినిమాను భారీగానే విడుదల చేసారు. దీనికి స్పందన కూడా బాగానే వస్తుంది. కథ రొటీన్‌గానే ఉన్నా.. సంపత్ నంది స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయింది. దానికితోడు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోయాయి.