Seetimaarr: సీటీమార్ టీజ‌ర్.. గోపిచంద్ అభిమానుల‌కు ఇక పండుగే..!

Seetimaarr అగ్రెసివ్ స్టార్ గోపిచంద్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్న చిత్రం సీటీమార్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ ముందే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా, నవంబ‌ర్ లో ఓ షెడ్యూల్‌ని మొద‌లు పెట్టి షూటింగ్‌ను పూర్తి చేశారు. ఏప్రిల్ 2 చిత్రాన్ని విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టిన చిత్ర బృందం తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేసింది.

సీటీమార్ టీజర్ సినిమా పై ఆస‌క్తిని పెంచింది. ఇందులో స‌న్నివేశాలు అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. గోపిచంద్ డైలాగ్ చూస్తుంటే సినిమా మాస్ ప్రేక్ష‌కుల‌కు మంచి ఫీస్ట్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం కాగా, . సంపత్ నంది హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు.

దిగంగ‌న కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి ఎస్‌. సౌందర్‌ రాజన్‌, ఎడిట‌ర్‌ త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ. కొన్నాళ్లుగా స‌క్సెస్ కోసం దోబూచులాడుతున్న గోపిచంద్ ఈ సినిమాతో స‌క్సెస్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. ఆ తర్వాత చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. మధ్యలో ‘జిల్’ సినిమాతో మాత్రం కాస్త పర్వాలేదనిపించాడు.

Advertisement