PRE LOOK: రొమాంటిక్ పోస్ట‌ర్స్‌తో హీట్ పెంచుతున్న అల్లూవార‌బ్బాయి..!

అల్లు అరవింద్ టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వార‌సులు అల్లు అర్జున్, శిరీష్ న‌టులుగా తెరంగేట్రం చేశారు. వీరిద్ద‌రిలో బ‌న్నీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండ‌గా, శిరీష్ మాత్రం ఇంకా న‌త్త‌న‌డ‌కన ముందుకు సాగుతున్నాయి. స్టార్ కిడ్ అయినా స్టార్ స్టేటస్ పట్టేయడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నాడు . ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినా కెరీర్‌ని టర్న్ చేసే సరైన హిట్ మనోడి ఖాతాలో ఇప్పటిదాకా పడలేదు. చివ‌రిగా ఏబీసీడీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శిరీష్ రెండేళ్ల త‌ర్వాత ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో తన ఆరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

త‌న ఆరో చిత్రంలో శిరీష్ సరికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇందుకోసం త‌న మేకొవ‌ర్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేయగా, ఇందులో యంగ్ హీరోయిన్‌తో అల్లు శిరీష్ అద్దం మాటున రొమాన్స్ చేస్తున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అయింది. తాజాగా బెడ్‌పై రొమాన్స్ చేస్తున్న పిక్ విడుద‌ల చేస్తూ, మూవీ ఫ‌స్ట్‌లుక్ మే 30 ఉద‌యం 11ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో శిరీష్ జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. మే 30వ తేదీ అల్లు శిరీష్ పుట్టిన రోజు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్నారు.