Savitri: సావిత్రి చేతిలో ఉన్న ఈ మ‌న్మ‌థుడు ఎవ‌రో తెలుసా?

Savitri: టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో వార‌సుల హ‌వా ఎక్కువే. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హీరోలుగా ఉన్న చాలా మంది స్టార్స్ చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా వెండితెర‌పై అల‌రించిన వాళ్లే. రెండు మూడేళ్ల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు కూడా వారు వెండితెర‌పై కనిపించారు. తండ్రులు స్టార్ హీరోలుగా ఉన్న స‌మ‌యంలో త‌మ పిల్ల‌ల‌ని కూడా వెండితెర‌పై చూపించాల‌ని చాలా ముచ్చ‌ట ప‌డేవారు. ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, మంచు విష్ణు, మనోజ్‌, అఖిల్ వంటి వారు బాల న‌టులుగా క‌నిపించి అల‌రించారు.


Savitri With Akkineni Nagarjuna In Velugu Needalu Movie
Savitri With Akkineni Nagarjuna In Velugu Needalu Movie

బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలో కూడా ఇప్ప‌టి స్టార్‌ హీరోలు చైల్డ్‌ అర్టిస్టులుగా నటించారు. తాజాగా సావిత్రికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, అందులో సావిత్రి చేతిలో ఉన్న బుడ్డోడిపై అంద‌రి దృష్టి ప‌డింది. ఎవ‌రా అని ప‌లు ఆరాలు తీయ‌గా, ఆయ‌న లెజెండరి నటుడు తనయుడు.. ప్ర‌స్తుత తెలుగు ప్రముఖ హీరోల్లో ఒకడు అని తెలిసి షాక్ అవుతున్నారు.


Savitri With Akkineni Nagarjuna In Velugu Needalu Movie
Savitri With Akkineni Nagarjuna In Velugu Needalu Movie

అప్ప‌ట్లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వ‌రుస సినిమాలు చేస్తున్న స‌మయంలో కుమారుడు నాగార్జున‌ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌యం చేశాడు నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాలు చేశాడు. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్‌ చైల్డ్‌ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిపాపగా ఉన్నాడు.


‘సుడిగుండాలు’ సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోల‌లో మ‌న‌కు క‌నిపిస్తుంది అక్కినేని నాగార్జున‌నే. టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా అమ్మాయిల మ‌న‌సులు దోచుకున్ నాగ్ కింగ్‌గా అభిమానుల‌తో పిలిపించుకుంటున్నారు. ఇప్ప‌టికీ సినిమాల‌తో బిజీగా ఉంటున్న నాగ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కత్వంలో యాక్ష‌న్ మూవీ అలానే బంగార్రాజు అనే చిత్రం చేస్తున్నాడు.