POOJA HEGDE: టాలీవుడ్‌లో విషాదం.. భావోద్వేగంలో పూజా హెగ్డే

ఈ రోజు ఉద‌యం తమిళ న‌టుడు వివేక్ హ‌ఠాన్మ‌ర‌ణం తెలుగు, త‌మిళ అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. మంచి వ్య‌క్తి ఆక‌స్మికంగా తుది శ్వాస విడిచారు అని తెలిసి ప్రతి ఒక్క‌రు శోక‌సంద్రంలో మునిగారు. అయితే ఈ మ‌ర‌ణ వార్త మ‌ర‌చిపోక‌ముందే టాలీవుడ్‌లో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌లు తెలుగు చిత్రాల‌కు కో డైరెక్టర్‌గా ప‌ని చేసిన స‌త్యం హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్ర‌మ దిగ్ర్భ్రాంతి చెందింది. పూజా హెగ్డే అయితే భావోద్వేగానికి గురైంది.

స‌త్యంతో క‌లిసి పూజా హెగ్డే అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో వంటి చిత్రాలు చేసింది. ఆయ‌న మ‌ర‌ణ వార్త విని షాక్‌కు గురైన పూజా హెగ్డే ఆయ‌న ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయనతో అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా’ అంటూ ట్వీట్‌ చేసింది.థ‌మ‌న్ కూడా స‌త్యంకు ఘ‌న నివాళి అర్పించారు. కాగా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అయిన కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుల దగ్గర కో – డైరెక్టర్స్‌ గా సత్యం గారు పనిచేశారు.రాజమౌళి-నితిన్‌ కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘సై’కి చీఫ్‌ కో డైరెక్టర్‌గా ప‌ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement