Satyadev : సత్యదేవ్.! ఏంటా బూతులు.? ‘గాడ్ ఫాదర్’ మత్తు తలకెక్కిందా.?

NQ Staff - October 5, 2022 / 02:34 PM IST

Satyadev  : సత్యదేవ్.! ఏంటా బూతులు.? ‘గాడ్ ఫాదర్’ మత్తు తలకెక్కిందా.?

Satyadev  : యువ నటుడు సత్యదేవ్, మెగా ఛాన్స్ కొట్టేశాడు ‘గాడ్ ఫాదర్’ సినిమాతో. అందులో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయ్. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ యువనటుడు.

మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానని చెప్పుకుంటోన్న సత్యదేవ్, అనూహ్యమైన రీతిలో సోషల్ మీడియాలో ట్వీటేశాడు. ‘కెసిపిడి’ అంటూ సత్యదేవ్ ట్వీటేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయినప్పుడు, ఎదిగే కొద్దీ ఒదిగి వుండాలని తెలియకపోతే ఎలా.?

కేసీపీడీ.. అర్థం తెలిసే ట్వీటేశావా సత్యదేవ్.?

కేసీపీడీ అంటే ఓ బూతు మాట. ఈ మధ్య సినిమాలకు సంబంధించి తరచూ ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షార్ట్ ఫామ్‌లో తిడితే, ఆ అర్థాన్ని ఎలాగైనా మార్చేసుకోవచ్చు.
సత్యదేవ్ లాంటి యువనటుడు ఇలాంటి పదాన్ని, ట్విట్టర్ వేదికగా వదలడం అస్సలే మాత్రం సబబుగా లేదు. అప్పుడే సక్సెస్ మత్తు తలకెక్కిపోయి, ఒళ్ళు తెలియని మైకంలో పొగరుగా వ్యవహరిస్తే ఎలాగంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సత్యదేవ్ నెగెటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us