Thimmarusu Review: ‘తిమ్మరుసు’ రివ్యూ : ఇంట్రెస్టింగ్ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌

Thimmarusu Review: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్ల మూడు నెలలుగా మూత పడి ఉన్నాయి. ఎట్టకేలకు మళ్లీ థియేటర్లు మొదలు అవ్వడంతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. కరోనా భయం ఇంకా ఉంది. కనుక సినిమా ఖచ్చితంగా చూడదగ్గది అంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి. కనుక ఈ సినిమా మరి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Satyadev Thimmarusu Movie Review Rating
Satyadev Thimmarusu Movie Review Rating

కథ :

ఒక మర్డర్‌ తో కథ మొదలు అవుతుంది. ఆ కేసులో అమాయకుడు అయిన ఒక వ్యక్తిని పోలీసులు ఇరికిస్తారు. నిర్ధోషి అయిన ఆ వ్యక్తి తరపున వాదించేందుకు లాయర్ రామ్‌ (సత్యదేవ్‌) సిద్దం అవుతాడు. ఆ క్రమంలో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అసలు చనిపోయింది ఎవరు.. చంపింది ఎవరు ఎందుకు ఒక అమాయకపు వ్యక్తిని పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తారు.. ఇంతకు లాయర్ రామ్‌ అతడిని ఎలా కాపాడుతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

నటుడిగా పరిచయం అయిన సత్యదేవ్‌ ఈ సినిమాలో మరోసారి ది బెస్ట్‌ ఇచ్చాడు. హీరో అనడం కంటే నటుడిగా మంచి ప్రతిభ కనబర్చాడు అనడంలో సందేహం లేదు. లాయర్‌ గా మంచి నటనతో సినిమా స్థాయిని పెంచాడు అనడంలో సందేహం లేదు. ఇక బ్రహ్మాజీ ఎప్పటిలాగే మంచి సపోర్టింగ్‌ రోల్‌ లో నటించడంతో పాటు నవ్వించాడు. ఇక హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌ కు నటించడానికి పెద్దగా స్కోప్‌ దక్కలేదు. అయితే ఉన్నంతలో ఆకట్టుకుంది. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

Satyadev Thimmarusu Movie Review Rating
Satyadev Thimmarusu Movie Review Rating

టెక్నీషియన్స్‌ :

సినిమాను దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఆకట్టుకనే విధంగా తెరకెక్కించాడు. స్క్రీన్‌ ప్లే మొదలుకుని డైలాగ్స్ వరకు అన్ని విషయాల్లో కూడా అతడి యొక్క ప్రతిభ కనిపించింది. కథ కోసం కాస్త ఎక్కువగానే రీసెర్చ్‌ చేసినట్లుగా ఉన్నారు. అందుకే ఎక్కడ ఎలాంటి లూప్‌ హోల్స్ లేవు. ఇక సినిమాటోగ్రాఫర్ కూడా సింపుల్‌ గా సహజ సిద్దంగా పాత్రలను మరియు సన్నివేశాలను చూపించేందుకు సహాయ పడ్డాడు. సంగీతం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు మినహా బాగానే ఉంది.

విశ్లేషణ :

నటుడిగా గుర్తింపు దక్కించుకునేందుకు చాలా కాలం వెయిట్‌ చేసిన సత్యదేవ్‌ కు వచ్చిన ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు అతడు మంచి నటనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో అద్బుతమైన నటనను కనబర్చిన సత్యదేవ్‌ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మరోసారి సత్యదేవ్‌ ఆకట్టుకున్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన మొదటి సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాకు ఖచ్చితంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును కొనసాగించేందుకు అన్నట్లుగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ప్రేక్షకులకు బోర్‌ ఫీల్ కలుగకుండా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా సినిమా ఉంది. కనుక ఈ సినిమా ను చూసేందుకు జనాలు థియేటర్లకు రావచ్చు.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • సత్యదేవ్ నటన,
  • కథలో ట్విస్ట్‌,
  • బ్రహ్మాజీ,
  • నిడివి ఎక్కువ లేకపోవడం

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్‌ హాఫ్‌ లో కొన్ని సన్నివేశాలు
  • సత్యదేవ్‌, బ్రహ్మాజీ కాకుండా స్టార్స్ పెద్దగా లేకపోవడం

చివరగా: చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా.. చూడదగ్గ సినిమా.

రేటింగ్‌ : 3/5