Satya raj: కోవిడ్‌ని జ‌యించిన క‌ట్ట‌ప్ప‌.. త్వ‌ర‌లోనే షూటింగ్‌కి..!

Satya raj: బాహుబ‌లి సినిమాలో క‌ట్ట‌ప్ప అనే పాత్ర‌లో ఒదిగిపోయిన న‌టుడు స‌త్య‌రాజ్. ఈ పాత్ర‌లో స‌త్య‌రాజ్ త‌ప్ప మ‌రే న‌టుడిని ఊహించ‌లేం అనే విధంగా ఆయ‌న న‌టించారు. తెలుగులో ఎన్నో ప‌వ‌ర్ ఫుల్ పాత్రలు పోషించిన స‌త్య‌రాజ్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయన చెన్నైలోని అమింజిక్కరైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంద‌గా, ఆయ‌న ఆరోగ్యంపై అభిమానుల‌లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

satya raj wins battle against Covid2
satya raj wins battle against Covid2

సత్యరాజ్ ప్రస్తుత వయస్సు 67 ఏళ్ళు. ఆయన వయసు రీత్యా ఏమవుతుందోనన్న భయం నెలకొంది. సత్యరాజ్ లేటెస్ట్ హెల్త్ కండీషన్ పై సమాచారం అందాల్సి ఉంది. ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

చెన్నైవ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం స‌త్య‌రాజ్ ఆరోగ్యం కొద్దిగా విషమంగానే ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెన్నై వర్గాలు చెప్పుకొచ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం స‌త్య‌రాజ్ క‌రోనాని జ‌యించాడ‌ట‌.

అంద‌రి ఆశీస్స‌లు, ప్రార్ధ‌న‌ల కార‌ణంగా క‌ట్ట‌ప్ప క‌రోనా నుండి కోలుకున్నాడు. ఆయ‌న ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే షూటింగ్‌లో ను పాల్గొన‌నున్నాడ‌ట‌. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్యరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి కట్టప్పగా… దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్న సత్యరాజ్, ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ లో సైతం కీలక రోల్ చేశారు.

satya raj wins battle against Covid2
satya raj wins battle against Covid2

అలాగే దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే మూవీలో సత్యరాజ్ కీలక రోల్ చేశారు. సాయి ధరమ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఇక సత్యరాజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.