VAKEEL SAAB: వ‌కీల్ సాబ్ స్పెష‌ల్ ట్రీట్‌.. రంజింప‌జేస్తున్న‌ స‌త్య‌మేవ జ‌య‌తే సాంగ్‌

VAKEEL SAAB ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 09న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, మగువ మగువ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా ఇప్పుడు స‌త్య‌మేవ జ‌య‌తే అనే సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఈ పాట‌కి రామ‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా, శంక‌ర్ మ‌హదేవ‌న్ ఆల‌పించారు. స‌త్యం కోసం నిల‌బ‌డే పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తాడ‌ని, త‌ప్పులు చేస్తే దండిస్తాడ‌ని ఈ సాంగ్ ద్వారా తెలియ‌జేశారు. ఈ పాట శ్రోత‌ల‌ని రంజింప‌జేస్తుంది. పేదోళ్ల తరఫున నిలబడతాడు.. నిజం మనిషిరా.. కష్టమంటే వెంటనే అండగా ఉంటాడు.. అసలు మనిషిరా అంటూ రామజోగయ్య పదునైన పదాలు అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిత్రంలో మార్పులు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

 

Advertisement