Godfather : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఆ ప్రముఖ నటుడెవరో తెలుసా.?

NQ Staff - October 7, 2022 / 07:41 PM IST

Godfather : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఆ ప్రముఖ నటుడెవరో తెలుసా.?

Godfather : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ పెద్దాయన పాత్రలో నటించాడో ప్రముఖ నటుడు. ఇప్పటితరానికి ఆయనెవరో తెలిసే అవకాశం లేదు. కానీ, చాలా ఏళ్ళ క్రితం ఆయన ఓ ప్రముఖ నటుడు. ఆయనెవరో కాదు సర్వధమన్ బెనర్జీ.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో సీఎం పీకేఆర్ పాత్రలో నటించారు సర్వధమన్ బెనర్జీ. చాలాకాలం క్రితం ఆయన ఓ తెలుగు సినిమాలో నటించారు. అదే ‘సిరివెన్నెల’. ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ క్లాసిక్.

‘సిరివెన్నెల’ సర్వదమన్.. ఇన్నేళ్ళ తర్వాత..

సర్వదమన్ బెనర్జీ గతంలో చిరంజీవితో ‘స్వయంకృషి’ సినిమాలోనూ నటించారు. ఓ ప్రేమ కథ అనే ఇంకో సినిమాలోనూ ఆయన కనిపించారు. అన్నట్టు, క్రికెటర్ ధోనీ బయోపిక్‌లో కూడా సర్వదమన్ నటించడం గమనార్హం.

సినిమాల్ని పూర్తిగా మానెయ్యలేదుగానీ, సర్వదమన్ చాలా అరుదుగా మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. ఆ సర్వదమన్ గురించి ఇప్పుడు తెలుగునాట ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. తిరిగి ఆయన సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
‘సిరివెన్నెల’ సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us