Sarkaru Vaari Paata: దుబాయ్ లో ప్యాకప్ చెప్పిన సర్కారు వారి పాట టీమ్
Samsthi 2210 - April 5, 2021 / 10:45 AM IST

Sarkaru Vaari Paata బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఏ సినీ ఇండస్ట్రీ అయినా తనకు సంబంధం లేదు.. జాగ్రత్తలు పాటించకపోతే తన పని తాను చేసుకుంటూ పోతానంటుంది కరోనా మహమ్మారి. ఎక్స్ ట్రా డోస్ తో సెకండ్ వేవ్ అంటూ తన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తూ అందర్ని హడలెత్తిస్తుంది. దాదాపు పది నెలల తర్వాత టాప్ హీరోలంతా సినిమా షూటింగ్స్ కి బయలుదేరారు. సరిగ్గా సినిమాలు షూటింగ్స్ అయిపోయే దశలో మళ్ళీ కరోనా ఠారెత్తిస్తోంది. టాలీవుడ్ లో టాప్ హీరోలు, హీరోయిన్స్ దగ్గర్నుండి దర్శకనిర్మాతల్ని సైతం వదిలిపెట్టడంలేదు. అటు బాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇటీవల బాలీవుడ్ ఖిలాడీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.
అందుకే నిర్మాతలంతా తమ సినిమాల షూటింగ్స్ ని పోస్ట్ పోన్ చేసుకునే స్థితికి చేరుకున్నారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ మహేష్ బాబు కు తండ్రి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథా నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను దుబాయ్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కీలకమైన సీన్లను, యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేస్తుంది చిత్రబృందం. కరోనా మహమ్మారి సర్కారు వారి పాట పై విజృంబిస్తుంది.
దుబాయ్ లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ఫిల్మ్ టీమ్ భయాంధోళనకు గురవుతుంది. అలాగే నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేయగా.. అది కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు పరశురామ్. ఇక్కడే దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సర్కారు వారి పాట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.