MAHESH BABU: స‌ర్కారు వారి పాట టీజ‌ర్ అప్‌డేట్.. ఇక ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. దుబాయ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, క‌రోనా విజృంభించ‌డంతో మూవీ షూటింగ్ వాయిదా వేశారు. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విల‌న్‌గా తమిళ నటుడు అరవింద్ స్వామి, కన్నడ స్టార్ ఉపేంద్రల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత తమిళ స్టార్ మాధవన్ ‘సర్కారు వారి పాట’లో మహేష్ కు విలన్ గా నటించబోతున్నారని టాక్స్ వచ్చాయి. దీనిపై క్లారిటీ అయితే రావ‌ల‌సి ఉంది.

ఇక ‘సూపర్ స్టార్ కృష్ణ’ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్ ప్ర‌తి ఏడాది ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు. ఈ ఏడాది కూడా
మ‌హేష్ తన కొత్త సినిమా టీజర్ రూపంలోనో, లేదా కనీసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తోనే, మహేష్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజు టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌నే టాక్ జోరుగా న‌డుస్తుంది. గత ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ని ప్రకటించి, కృష్ణగారికి మంచి గిప్ట్ ఇచ్చారు. ఈ పుట్టిన రోజుకి టీజ‌ర్‌తో ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించ‌నున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది.