Sarkaru vaari paata: క‌రోనా నుండి పూర్తిగా కోలుకున్న త‌మ‌న్.. మ‌హేష్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌లు

Sarkaru vaari paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘అతడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, టీవీలోనూ టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఖలేజా’ కాస్త నిరాశపరిచినా సూపర్ స్టార్‌లోని సరికొత్త కామెడీ కోణాన్ని ప్రేక్షకాభిమానులకు పరిచయం చేశారు

Sarkaru Vaari Paata Music Director S Thaman's Childhood Picture Becomes  Talk Of The Town! - Filmibeat

త్రివిక్రమ్.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతోంది.. మహేష్ నటించబోయే 28వ సినిమా ఇది.. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. దీంతో మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ సినిమాకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా న‌డుస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం మహేశ్‌బాబు దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెకేషన్‌లోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తాను చేయనున్న సినిమాకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు మహేశ్‌. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం గురించిన చర్చల కోసం త్రివిక్రమ్‌ దుబాయ్‌ వెళ్లారు. ఈ చర్చల్లో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ‘

ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో భాగంగా మహేశ్, త్రివిక్రమ్, తమన్‌ దుబాయ్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఇటీవ‌ల మ‌హేష్‌,థ‌మ‌న్ కి కరోనా రావ‌డంతో కొద్దిగా బ్రేక్ ప‌డింది. ఇప్పుడు థ‌మ‌న్ కోలుకోవ‌డంతో తిరిగి మ్యూజిక్ పనులు మొద‌లు పెట్టారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌.ఈ ఏడాది సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది.

sarkaru vaari pata
sarkaru vaari pata

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా బడా హీరోగా దూసుకుపోతోన్న వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు. దీనికితోడు కెరీర్‌ ఆరంభంలోనే వరుస హిట్లతో సత్తా చాటాడు. మధ్యలో పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ మహేశ్ బాబు సూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ జోష్‌తోనే ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పలు ప్రాజెక్టులను ఇప్పటికే లైన్‌లో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు