Sarkaru vaari paata: మ‌హేష్ లేకుండానే స‌ర్కారు వారి పాట షూటింగ్ మొద‌లు పెట్ట‌బోతున్నారా..!

Sarkaru vaari paata: స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌ర్వాత మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు.

Sarkaru vaari paata shooting started without mahesh (1)
Sarkaru vaari paata shooting started without mahesh (1)

మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి,సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని దూసుకుపోతున్నాడు.సర్కారు వారి పాట సినిమాతో త్వరలోనే మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ సినిమా క‌రోనా వ‌ల‌న ,మ‌హేష్ ఆరోగ్య స‌మస్య‌ల వ‌ల‌న వాయిదా ప‌డుతుంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మహేష్ బాబు లేకుండానే జరుగుతోంది అని తెలుస్తోంది. మహేష్ బాబు కాలికి సర్జరీ అయి రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈమధ్య మహేష్ బాబు కి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. దీంతో ఇప్పట్లో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొనే సూచనలు కనిపించకపోవడంతో చిత్రబృందం మహేష్ బాబు లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు అని తెలుస్తోంది.

ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్ లోని జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాల్లో శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ చాలా స్పీడ్ గా పూర్తి చేసేస్తోంది సినిమా యూనిట్.

Sarkaru vaari paata shooting started without mahesh2
Sarkaru vaari paata shooting started without mahesh2

ఇక సంక్రాంతి నుంచి సర్కారు వారి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కికి కావడం అంటోంది యూనిట్. సంక్రాంతి పండగ కానుకగా సినిమాను రిలీజ్ చేయలేకపోయింది యూనిట్. అందుకే పండక్కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ కంపోజీషన్ కంప్లీట్ చేసాడు తమన్. సాంగ్స్ అన్ని నెక్ట్స్ లెవల్లో ఉంటాయని, సర్కారు వారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయమని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు త‌మ‌న్.