Sarkaru vari pata : సర్కారు వారి పాట సక్సస్ ఫుల్ గా దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి బయలుదేరారు చిత్ర యూనిట్. నెలరోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన పరశురాం … నెక్స్ట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్.. ఛేజింగ్ సీన్స్ తో పాటు మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే భారీ బ్యాంక్ సెట్ రెడీ కూడా చేశారట.

ఈ సెట్ లో కూడా నెల రోజుల టాకీపార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. అలాగే మహేష్ బాబు మీద సర్కారు వారి పాట అన్న సోలో టైటిల్ సాంగ్ కూడా తీసేందుకు ఒక ప్రత్యేకమైన సెట్ రెడీగా ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ కూడా 45 రోజులు ప్లాన్ చేశారని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పరశురాం సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్, అమెరికా కాకుండా గోవా లో ప్లాన్ చేశాడని సమాచారం. మరి ఈ సడన్ ఛేంజ్ ఏంటన్నది తెలీదు గాని సముద్ర తీరాన సర్కారు వారి పాట కి సంబంధించిన కొన్ని కీలకమైన సీన్స్ ని కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేశాడట.
Sarkaru vari pata : సర్కారు వారి పాట బృందం అమెరికా షెడ్యూల్ కి రెడీ అవుతారట.
గోవా షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక అమెరికాలో జరగబోయో 45 రోజుల షెడ్యూల్ కోసం సర్కారు వారి పాట బృందం రెడీ అవుతారట. అమెరికా షెడ్యూల్ తర్వాతే హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుందని తెలిస్తోంది. ఇక దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. ‘దుబాయ్ డైరీస్’ పేరుతో అక్కడి షూటింగ్ విశేషాలతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ తోపాటు మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.