SARDAR: ఈ సారి స‌ర్ధార్‌గా కార్తీ.. ఫ‌స్ట్ లుక్‌తోనే భారీ అంచ‌నాలు పెంచేసిన స్టార్ హీరో

Priyanka - April 25, 2021 / 02:36 PM IST

SARDAR: ఈ సారి స‌ర్ధార్‌గా కార్తీ.. ఫ‌స్ట్ లుక్‌తోనే భారీ అంచ‌నాలు పెంచేసిన స్టార్ హీరో

త‌మిళ న‌టుడు కార్తి త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచే కార్తీ రీసెంట్‌గా సుల్తాన్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఆ సినిమా రిలీజ్ అయి నెల కూడా కాలేదు, అప్పుడే త‌న త‌ర్వాతి చిత్రం ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్నాడు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం స‌ర్ధార్ అనే సినిమా చేస్తున్నాడు కార్తి.

sarda

భారీ బ‌డ్జెట్‌తో స‌ర్ధార్ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తుండ‌గా, ఈ చిత్రంలో రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రంలో కార్తి లుక్ స్ట‌న్నింగ్‌గా ఉంది. ఇందులో ఆయ‌న డ్యూయ‌ల్ పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. గతంలో విక్రమార్కుడు రీమేక్ గా తెరకెక్కిన ‘చిరుతై’తో పాటు ‘కాష్మోరా’లోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. అందులో ‘చిరుతై’ ఘన విజయం సాధించింది. మరి ఇప్పుడు ‘సర్దార్’గా కార్తీ ఎలా ఆకట్టుకుంటాడో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రాజీషా విజయన్, సిమ్రాన్, చుంకీ పాండే ఈ సినిమాలో ఇతరముఖ్య పాత్రధారులు. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us