Bigg Boss 5: హౌజ్‌లో ద‌మ్మున్న మ‌గాడు అత‌డే.. షణ్ముఖ్ పోయి మూల‌కు కూర్చో

Bigg Boss 5: బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి కంటెస్టెంట్స్ స‌ర‌యు కంటెస్టెంట్స్‌పై ఎంత దారుణంగా కామెంట్స్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. నాగార్జున ప‌క్క‌న నిలుచొని ఒక్కొక్క‌రిని క‌డిగి ప‌డేసింది. 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ గురించి చెప్ప‌మంటే బెస్ట్ కంటెస్టెంట్ల గురించి చెబుతూ ఎమోషనల్ అయిన సరయు.. వరస్ట్ కంటెస్టెంట్ల గురించి చెబుతూ శివాలెత్తింది.

Sarayu Reveals Interesting Facts About Bigg Boss 5 House
Sarayu Reveals Interesting Facts About Bigg Boss 5 House

షన్ను, సిరి కలిసి ఆడుతున్నారు.. బయటే కలిసి మాట్లాడుకుని వచ్చారు అని చెప్పింది. సన్నీతో గతంలో ఓ సినిమా చేశాను.. అక్కడ జరిగిన సంఘటనతో ఆయన ఇగో హర్ట్ అయింది. అది ఇప్పటికీ మనసులో పెట్టుకున్నాడు. లహరి గురించి చెబుతూ.. నిన్ను నువ్వు ఫ్రూవ్ చేసుకోవడానికి ఎదుటి వాళ్లను తక్కువ చేయాల్సిన పని లేదు అని అంది.

ఇక షన్ను గురించి మాట్లాడతూ.. అరేయ్ ఏంట్రా ఇది.. బయటే అనుకుని ఇలా రావొద్దురా.. ముందు ఆమెను లేపి..తరువాత నువ్ లేద్దామని అనుకుంటున్నావారా అంటూ చుర‌క‌లు అంటించింది. అయితే హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక అరియానా షోలో ఈ అమ్మ‌డు రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.

సిరి హనుమంత్ మగాళ్లను అడ్డుపెట్టుకుని ఆట ఆడుతుందని చెప్పిన స‌ర‌యు.. యాంకర్ రవి అయితే మంచోడి లెక్క నీతి సూత్రాలు భోదిస్తాడు కానీ.. ఇతనిలో విషయమే లేదు అని చెప్పేసింది. వీజే సన్నీకి అయితే అసలు క్యారెక్టర్ లేదని చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో దమ్మున్న మొగోడు ఎవడైనా ఉన్నాడంటే అతను విశ్వ ఒక్కడే అని చెప్పింది.

షణ్ముఖ్ జస్వంత్‌ని అయితే పోయి మూల‌కు కూర్చోమ‌ని చెప్పింది సరయు. ‘నిజంగా నీతో దమ్ము ధైర్యం ఉంటే.. నువ్ మొగోడివి అయితే సింగిల్‌గా ఆట ఆడు.. లేదంటే గాజులు వేసుకుని మూలన కూర్చో.. నేను గాజులు వేసుకున్నా కూడా సింగిల్‌గానే ఆట ఆడతా.. నువ్ ఆడలేవు కాబట్టి మూలన కూర్చో అంటూ ఒక్కొక్క‌రిని ఏకి పారేసింది స‌ర‌యు.