Bigg Boss Telugu 5: తొలి వారం ఎలిమినేట్ కానున్న ఆ మ‌హిళా కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తొలి సీజ‌న్ సెప్టెంబ‌ర్ 5 నుండి ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 19 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ షో నుండి ఒక‌రు ఎలిమినేట్ కాబోయే స‌మ‌యం వ‌చ్చింది. ఈ వారం నామినేషన్‌లో యాంకర్‌ రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీ ఉండగా వీరిలో కొందరిని హోస్ట్‌ నాగ్‌ నేడు సేవ్‌ చేయనున్నాడు. ఎలిమినేట్‌ అవనున్న కంటెస్టెంట్‌ పేరును రేపు వెల్లడిస్తాడు.

Sarayu Eliminated First Week From Bigg Boss Telugu 5
Sarayu Eliminated First Week From Bigg Boss Telugu 5

అయితే ఈ వారం ఎలిమినేట్ కానున్నారంటూ ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో ఏది నిజం ఏది అబ‌ద్ధం అనేది తెలియ‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ వారం నుండి హౌజ్ నుండి ఎలిమినేట్ కానుంది స‌ర‌యు అని తెలుస్తుంది. యూట్యూబ్ బూతు వీడియోలలో హాట్ బ్యూటీ సరయుకి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెడింగ్‌లోనే ఉంటాయి. భారీ దేహపు అందాలతో కవ్విస్తూ.. పచ్చి బూతులు మాట్లాడుతూ యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది.

బిగ్ బాస్ స్టేజ్‌పై వ‌చ్చిన‌ప్పుడే బూతుల పురాణం మొద‌లు పెట్టిన స‌ర‌యు హౌజ్‌లో మాత్రం కొంచెం కూల్‌గానే ఉంది. ఆమె కొన్ని వారాలు ఉంటుంద‌ని అంద‌రు అనుకున్నారు.కాని ఈ వారం తొలి కంటెస్టెంట్‌గా ఈ అమ్మ‌డు వెళ్ల‌డం ప‌క్కా అంటున్నారు. అంద‌రి క‌న్నా స‌ర‌యుకి త‌క్కువ ఓట్స్ వచ్చిన‌ట్టు స‌మాచారం.

7 ఆర్ట్స్ బ్యానర్‌లో.. ‘సరయు క్లినిక్’.. ‘డాక్టర్ సరయు’.. ‘ఎస్ ఐ సరయు’.. ‘పతివ్రత’.. ‘సరయు పెళ్లమైతే’.. ‘ఆకలి రాజ్యం’, ‘చూడాలని ఉంది’.. లాంటి వీడియోలలో సరయు తన విశ్వరూపం చూపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.