Puneeth: పునీత్ బ‌దులు నేను చ‌చ్చిపోయిన బాగుండేది.. ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన హీరో

Puneeth: కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత పునీత్‌ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ మ‌ర‌ణాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం.

sarath kumar tearful about puneeth1
sarath kumar tearful about puneeth1

పునీత్ ఆరేళ‍్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక ఆయన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

పునీత్ మ‌ర‌ణానంత‌రం ‘కర్ణాటక రత్న’ అవార్డుతో సత్కరించారు. ఈయన మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు కన్నడిగులు. తాజాగా జరిగిన సంస్మరణ సభలో అతిరథ మహారథులు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సహా ఎంతో మంది రాజకీయ నాయకులు పునీత్ సంస్మరణ సభలో కనిపించారు. సినీ ఇండస్ట్రీ అంతా ఈ సభలో ఉన్నారు.

త‌మిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ సభలో ఎమోషనల్ అయ్యారు. నాలుగేళ్ల కిందట వచ్చిన రాజకుమార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. ఆ సినిమా కన్నడనాట ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు శరత్. పవర్ స్టార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన బదులు తాను చనిపోయినా బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యాడు.

sarath kumar tearful about puneeth
sarath kumar tearful about puneeth

నాడు మహాత్మాగాంధీ అంత్యక్రియలకు 20 లక్షల మంది హాజరైతే.. మొన్న పునీత్ అంత్యక్రియలకు ఏకంగా 25 లక్షల మంది హాజరయ్యారు. ఇదొక్కటి చాలు కన్నడనాట పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న క్రేజ్ ఏంటో చెప్పడానికి..? తాజాగా జరిగిన పునీత్ నమన సంస్మరణ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.