Saranga Dariya:రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సారంగద‌రియా పాట‌

Samsthi 2210 - August 16, 2021 / 04:50 PM IST

Saranga Dariya:రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సారంగద‌రియా పాట‌

Saranga Dariya:జాన‌ప‌ద పాట‌లు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. వాటిపై అంద‌రిలో ఆస‌క్తి చాలా ఉంటుంది. ఇది గ‌మ‌నించిన మేక‌ర్స్ ఇప్పుడు ఆ పాట‌ల‌ని అటు ఇటుగా మార్చి మూవీస్ లో పెడుతున్నారు. అలా ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘సారంద దరియా పాట వ‌చ్చింది. జానపదం స్టైల్‌లో ఉండే పాట.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్, మంగ్లీ గానం పాటని మరో రేంజ్‌కి తీసుకువెళ్లింది.

Saranga Dariya Song Creates Record

Saranga Dariya Song Creates Record

ప్రోమోనే సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా ఫుల్ సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకోగా, తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది సారంగ దరియా పాట. అత్యంత వేగంగా 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న పాటగా రికార్డును సాధించింది. లిరికల్ వీడియోకే ఇన్ని వ్యూస్ వస్తే ఒరిజినల్ వీడియో వస్తే ఇంకొన్ని వ్యూస్ వస్తాయో అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యంతో కొత్త సొబగులద్దుకున్న ఈ తెలంగాణ జానపదాన్ని.. మంగ్లీ ఆలపించిన తీరు, దానికి హుషారెత్తించేలా సాయి పల్లవి కాలు కదిపిన విధానం పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఈ పాట‌కి ఇంత ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని చిత్ర యూనిట్ కూడా ఊహించి ఉండ‌రు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. కరోనా పరిస్థితులతో వాయిదా పడిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమిగో క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నారాయణ్ దాస్, పుష్కర్ రామ్, మోహన్ రామ్ నిర్మిస్తున్నారు.

సారంగ‌ద‌రియా పాట యూట్యూబ్ లో విడుద‌లైన వెంట‌నే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగింది. పాట నాది అంటూ ఓ మ‌హిళ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో స్వ‌యంగా శేఖర్ క‌మ్ముల రంగ ప్ర‌వేశం చేసి వివాదానికి పులిస్టాప్ పెట్టాడు.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us