SAI PALLAVI: సారంగ‌ద‌రియా సెన్సేష‌న్.. 200 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టిన సాయి ప‌ల్లవి సాంగ్

సాయి ప‌ల్ల‌వి సాంగ్స్ అంటే సెన్సేష‌న్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాయి. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే, రౌడీ బేబి, సారంగ‌ద‌రియా పాటలు సాయి ప‌ల్ల‌వి క్రేజ్‌ని ఏ రేంజ్‌లో పెంచాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్‌గా సారంగ‌ద‌రియా పాట‌తో సాయి ప‌ల్ల‌వి చేసిన ర‌చ్చ అంతా ఇంతాకాదు. తక్కువ టైంలోనే ‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మంగ్లీ గాత్రం, సాయిపల్లవి స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, పవన్‌ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది.

ఫిబ్రవరి 28న ల‌వ్ స్టోరీ చిత్రం నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది. ఇక 32 రోజుల‌లో 100 మిలియ‌న్ వ్యూస్ సాధించిన సారంగ‌ద‌రియా తాజాగా 200 మిలియ‌న్ల వ్యూస్ సాధించి స‌రికొత్త మైలురాయిని అందుకుంది. ల‌వ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.