Sara Ali Khan: బ్లాక్ డ్రెస్‌లో ప‌రేషాన్ చేస్తున్న సారా అలీ ఖాన్..!

Sara Ali Khan: సారా అలీ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది త‌క్కువ సినిమాలే అయిన కూడా ఎంతో ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

బ్యూటీఫుల్ హీరోయిన్ అనిపించుకుంటున్న సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లో రాకముందు ఒకప్పుడు ఎంతో లావుగా ఉండేది. అప్పుడు అలా 96 కిలోల వరకు లావుగా తయారైన సారా అలీ ఖాన్‌ని.. ఇప్పుడు ఇలా స్లిమ్‌గా, ఎంతో ఫిట్‌గా తయారైన సారాని చూసిన వాళ్లకు కచ్చితంగా ఓ డౌట్స్ రాక మానదు.

కేదర్‌నాధ్’ అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా.. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.అయితే…ఆ తర్వాత వచ్చిన ‘సింబా’లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడిప్పుడే సారా అలీఖాన్ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు. ఆమె నటించిన కేదార్ నాధ్, సింబా, లవ్ ఆజ్ కల్, కూలి నంబర్ వన్ చిత్రాలు విడుదలయ్యాయి.

ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో ఆమె నటించడం జరిగింది. సినిమాల‌తో కాక‌పోయిన సారా అలీ ఖాన్ ఫొటో షూట్స్‌తో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ ట్రెండీ డ్రెస్‌లో చాలా ముద్దుగా క‌నిపిస్తుంది సారా. ఈ అమ్మ‌డిని చూసిన వారందరు మంత్ర‌ముగ్దులు అవుతున్నారు.

మొదట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎఫైర్ నడిపిన సారా, ఆ తరువాత ఆర్యన్ కార్తీక్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఏదో ఒక విష‌యంతో సారా ఎప్పుడు వార్త‌లలో నిలుస్తూనే ఉంటుంది.