Santhosh shobhan : చిన్న హీరో వెనక పెద్ద నిర్మాణ సంస్థలు..వరుస ఆఫర్లు

Santhosh shobhan : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి గమ్మత్తైన విషయాలు జరుగుతాయో చెప్పడం చాలా కష్టం. ఏ సినిమా హిట్ అవుతుందో..ఏ సినిమా డిజాస్టర్ అవుతుందో కూడా రిలీజ్ కి ముందే చెప్పడం ఇంకా కష్టం. సక్సెస్ వెనకాలే ఇక్కడ ఎవరు పడినా. హీరో, దర్శకుడు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ..ఇలా ఎవరైనా ఒక్క సాలీడ్ హిట్ అందుకొని ఫాంలోకి వస్తే ఇక అందరూ వాళ్ళ వెంటే పడుతుంటారు. ఇటీవల వచ్చిన జాతిరత్నాలు సినిమాతో బాగా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పిలిశెట్టికి ఇప్పుడు వరుసగా క్రేజీ ఆఫర్ వస్తున్నాయి.

 santhosh-shobhan-is-suported-by-many-producers
santhosh-shobhan-is-suported-by-many-producers

ఆ లిస్ట్ లో తాజాగా సంతోష్ శోభన్ కూడా చేరాడు. ప్రముఖ దర్శకుడు శోభన్ కొడుకే ఈ సంతోష్ శోభన్. ప్రభాస్ తో వర్షం, బాబీ సినిమాతో మహేష్ ని డైరెక్ట్ చేసిన శోభన్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అప్పుడు సంతోష్ శోభన్ చాలా చిన్నవాడు. కాగా తను హీరో అవుతానంటే ఇండస్ట్రీ బాగానే సపోర్ట్ చేసింది. పేపర్ బాయ్ సినిమాతో వచ్చి ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇటీవల ఏక్ మినీ కథతో మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకి పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Santhosh shobhan : స్వయంగా సంతోష్ శోభన్ వెల్లడించాడు.

ఈ క్రమంలో సంతోష్ శోభన్ కి వరుసబెట్టి పెద్ద నిర్మాణ సంస్థలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రభాస్ కి సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కి సంబంధించిన వైజయంతీ మూవీస్ అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాలలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, అభిషేక్ మహర్షి అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నట్టు స్వయంగా సంతోష్ శోభన్ వెల్లడించాడు.