Sanjjanaa: ప్రభాస్ హీరోయిన్ నేల పై కూర్చోకుండానే యోగాసనాలు ఎలా వేసిందో చూడండి

Sanjjanaa: 2005లో వ‌చ్చిన సోగ్గాడు అనే సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ బ్యూటీ సంజ‌నా గ‌ల్రాని. ప్ర‌భాస్ న‌టించిన‌ బుజ్జిగాడు సినిమాతో ఈ అమ్మ‌డికి తెలుగులో బాగా పాపులారిటీ ద‌క్కింది. తెలుగులో సత్యమేవ జయతే అనే సినిమాలో న‌టించిన సంజ‌నా ఆ త‌ర్వాత సమర్థుడు, పోలీస్ పోలీస్, దసరా, ముగ్గురు, యమహో యమ, నేనేం చిన్నపిల్లనా, జగన్ నిర్దోషి, ఐ లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్, అవును2, 2 కంట్రీస్ అనే సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంది.

Sanjjanaa Galrani

స్టార్ హీరోల సినిమాలలో న‌టించిన కూడా సంజ‌నాకు ప్ర‌త్యేక గుర్తింపు రావ‌డం లేదు. గత ఏడాది ఆమె డ్రగ్స్ అమ్ముతున్నట్లు అలాగే సెక్స్ రాకెట్ కు సంబంధించిన కొన్ని ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లింది. అయితే జైలుకి వెళ్ల‌క‌ముందు అజీజ్ తో పెళ్లి చేసుకోగా, దానిని ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇటీవ‌ల త‌న పెళ్లిపై స్పందించిన సంజ‌నా అప్ప‌టి ప‌రిస్థితుల మూలంగా పెళ్లి గురించి స్పందించ‌లేద‌ని పేర్కొంది.

కరోనా మహమ్మారి విజృంభణ, వరుస లాక్ డౌన్లతో పేద, మధ్యతరగతి బ్రతుకులు కష్టాల కడలిలో న‌లిగిపోతున్న బాధ‌ల‌ని చూసిన సంజ‌నా ఇటీవ‌ల రోజూ వెయ్యి మందికి పైగా భోజనం అందిస్తున్నామని పేర్కొంది. బెంగళూరు హెచ్ఎల్ అన్నసంద్రపాలన ప్రాంతంలో రోజూ ఐదు వందల మందికి, తన ఇంటి దగ్గర్లో 500 మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నానని పేర్కొంది.

మ‌ర‌క‌లు తొల‌గించుకునేందుకు సంజ‌నా గ‌ల్రాని చాలా క‌ష్ట‌ప‌డుతుంది. ఒక‌వైపు సేవ‌లు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ అంద‌రికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ రోజు యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా సంజ‌నా కొన్ని యోగాస‌నాలు చేసింది. గాల్లో తేలుతూ ఈ అమ్మ‌డు చేసిన విన్యాసాల‌కు నెటిజ‌న్స్ మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు. సంజ‌నాలో చాలా టాలెంట్ ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.