Sanjana galrani: గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భాస్ హీరోయిన్.. త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకోనున్న సంజ‌నా

Sanjana galrani: ప్ర‌భాస్ స‌ర‌స‌న బుజ్జిగాడు చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ సంజనా గ‌ల్రాని. కన్నడ నటి అయిన సంజన తెలుగులో పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు సైతం సుపరిచితాలు అయ్యింది. ప్రభాస్‌ బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌లో మెరిసిన సంజన ఆ తర్వాత పలు చిత్రాల్లో సహా నటిగా, హీరోయిన్‌గా మెప్పించింది. ‘సత్యమేవ జయతే’, ‘దుశ్శాసన’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది.

sanjana-galrani says good news for fans
sanjana-galrani says good news for fans

కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కొన్ని వివాదాల్లో చిక్కుకుంది .శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లింది. ఈ క్రమంలో 2020 డిసెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్‌ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. అప్పటి వరకు తరచూ వార్తల్లో నిలిచిన సంజన పెళ్లి అనంతరం మీడియాకు దూరంగా ఉంది.

సంజ‌నా త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతుందంటూ ఇటీవ‌ల మీడియాలో జోరుగా పుకార్లు వ‌చ్చాయి. ఇవి కాస్తా సంజన దృష్టికి వెళ్లడంతో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ మండిపడింది. వైవాహిక జీవితం చాలా బాగుందని, తన పర్సనల్‌ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అంతేకాదు ఆధారాలు లేని వార్తలు సృష్టించందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సంజన హెచ్చరించింది.

sanjana-galrani says good news for fans
sanjana-galrani says good news for fans

తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పింది. ‘నేను ఇప్పుడు 5 నెలల గర్భంతో ఉన్నాను. కడుపుతో ఉన్నానని విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు. ప్రసవం అయ్యేంతవరకు శ్రమించాలనుకుంటున్నాను. పలువురు మహిళలు తమ ప్రసవం తేదీ సమీపం వరకు పనులు చేయడం నేను చూశాను. నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను ‘ అని చెప్పుకొచ్చింది సంజన.