రెండు రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు

Advertisement

ఒక వ్యక్తి జీవితాన్ని కేవలం రెండు రాళ్ల్లు పూర్తిగా మార్చేశాయి. ఒక్క దెబ్బ తో ఆతని దశ మారిపోయింది. మాములు జీవితం గడిపే అతడు కొన్ని వేళా కోట్ల కి అధిపతి అయ్యాడు. అసలు ఎం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే టాంజానియా వాసి
సానిని లేజర్ చిన్న పాటి గని కి యజమాని అక్కడ ఆ ఆగనిలో ఉన్న ముడి సరుకుల్ని తవ్వుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఆలా తవ్వుతున్న క్రమం లో అతనికి ఒక రెండు రాళ్ళూ లభించాయి. దానిలో వింత ఏముంది తవ్వుతున్నప్పుడు రాళ్లు దొరుకుతాయి అనిపిస్తుంది ఎవ్వరి కైనా… అయితే మన తెలుగు వాళ్ళు వెటకారంగా అనే ఒక మాట అతని లైఫ్ లో నిజం అయ్యింది ఏంటా అనుకుంటున్నారా..

రాళ్లు కాకపోతే రత్నాలు దొరుకుతాయా అనే మాట మనం చాల సార్లు విని లేదా వాడి ఉంటాము. కానీ ఇతడి లైఫ్ లో రత్నం కంటే విలువైన అటువంటి రెండు రాళ్ళూ దొరికాయి. ఇవి అత్యుత్తమ స్థాయి రత్నాలు అంట. మరొక విషయం ఈ టాన్జానైట్ ఖనిజం కూడా కేవలం ఉత్తర టాంజానియా లో తప్ప మరెక్కడా దొరకదు. వీటిని ఉంగరాలు, నెక్లస్ లు, బ్రెసెలెట్ ల వంటి వాటిలో పొందు పరుస్తారు.

అయితే ఇలా అతనికి దొరికిన రెండు రాళ్ళలో ఒక దాని బరువు 9.2 కిలోలు ఉండగా మరొక హాని బరువు 5.8 కిలోలు ఉంది మొత్తంగా 15 కిలోల విలువైన టాన్జనైట్ వీటిని విక్రయించగా అతనికి ఏకంగా 34 కోట్ల డాలర్ లు లభించాయి. మన కరెన్సీ లో చెప్పాలంటే దీని విలువ ఏకంగా 2566 కోట్ల రూపాలయాలు అన్న మాట.. ఈ ఖనిజాల గురించి స్థానిక భౌగోళిక శాస్త్రవేత్తలు మరొక విషయాన్ని భయటపెట్టారు. ఇప్పటి నుండి మరొక 20 సంవత్సరాల తరువాత ఈ ఖనిజాలు భూమిలో ఇంకా దొరకవు అంటూ తేల్చి చెప్పేసారు.

అయితే ఇంత మొత్తం లో ఈ ఖనిజం దొరికింది కూడా ఇతనికే మొదటి సారి అంట. ఇంతవరకు దొరికిన ఇలాంటి శిలలలో అత్యధిక బరువు గల శిల కేవలం 3.3 కిలోలు మాత్రమే. ఈ విషయం తెలియగానే ఆ దేశ అధికారి సానిని లేజర్ కి స్వయం గా ఫోన్ చేసి మరి ప్రశంసించాడు అంట. ఆ తరువాత మన దేశం లో కూడా ఇంత మొత్తం లో ఖనిజాలు లభించడాన్ని బట్టే చెప్పాలి మన దేశం కూడా ఒక రకంగా సంపన్నమైనదే అని అంటూ తెలియచేయడం జరిగింది… ఆలా అనుకోకుండా సంపన్నుడైన సానిని లేజర్ త్వరలోనే ఒక పెద్ద పార్టీ అక్కడికి వారికి ఇచ్చి తన ఆనందాన్ని వారితో పంచుకుంటానని తెలియ చేసాడు.. కానీ తంతే బూర్ల బుట్టలోపడడం అంటే నాకు తెలిసి ఇదేనేమో

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here