Acharya: ఆచార్య సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగీత..లాహే లాహే సాంగ్‌లో హైలెట్ అవుతుందా..?

Vedha - April 1, 2021 / 11:44 AM IST

Acharya: ఆచార్య సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగీత..లాహే లాహే సాంగ్‌లో హైలెట్ అవుతుందా..?

Acharya : ఆచార్య సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ ఆచార్య షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కారక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నాయి. మే 13న ఆచార్య సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సిద్దగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. నక్సస్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలలో మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటారని చిత్ర బృందం చెబుతోంది.

sangeetha-is-entrying-into-acharya-will-she-be-highlighted-in-lahe-lahe-song

sangeetha-is-entrying-into-acharya-will-she-be-highlighted-in-lahe-lahe-song

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్ .. పూజా హెగ్డే నటిస్తుండటం విశేషం. మెగా స్టార్ కి జంటగా కాజల్ నటిస్తుండగా చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే చరణ్ ది దాదాపు గంట నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అంటే పూజా క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుందన్నది అభిమానులకి తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్నారట. ఇక ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇన్నాళ్ళు ఈ సినిమాలో రెజీనా మాత్రమే మెగాస్టార్ పక్కన స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిందని అనుకున్నారు.

Acharya : ఆచార్యలో సంగీత సడన్ సర్‌ప్రైజ్ మాత్రం అదిరిపోయింది.

కానీ తాజాగా ఆచార్య సినిమా నుంచి లాహే లాహే అన్న లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. మెలోడితో సాగిన ఈ సాంగ్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఈ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ సంగీత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. లాహే లాహే పాటలో ఎక్కువగా సంగీత సందడే ఉండేలా అనిపిస్తోంది. ఈ మధ్య సంగీత సినిమాలలో తక్కువగా కనిపిస్తోంది. బుల్లితెర మీద మాత్రం బాగానే సందడి చేస్తోంది. ఇక ఆచార్యలో సంగీత సడన్ సర్‌ప్రైజ్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాలో కేవలం ఒక్క సాంగ్ లోనే కనిపిస్తుందా..లేక ముఖ్య పాత్ర ఏదైనా పోషించిందా అన్నది తెలియాలంటే ఆచార్య రిలీజయ్యే వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us