Sangeetha: ఒంపు సొంపులను తిప్పేసిన సంగీత.. పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా!

Sangeetha Dance in DHEE 13 Kings vs Queens
Sangeetha Dance in DHEE 13 Kings vs Queens

Sangeetha నాటి హీరోయిన్ సంగీత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాలో మోడ్రన్ మదర్‌గా పిచ్చి గంతులు వేసింది సంగీత. ఆ ఓవర్ యాక్షన్‌లో మళ్లీ సినిమా ఆఫర్లు రావడం లేదనుకుంటా. కానీ వెండితెర దూరం పెట్టినా కూడా బుల్లితెర మాత్రం అక్కున చేర్చుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు బుల్లితెరకు కావాల్సిందే ఆ ఓవర్ యాక్షన్. అందుకే ఇప్పుడు బుల్లితెరపై వస్తోన్న ఎంటర్టైన్మెంట్ షోలు, స్పెషల్ ఈవెంట్‌లలో సంగీత మెరుస్తోంది.

మొదటగా సంగీత బుల్లితెర పై జబర్దస్త్ షోలోనే కనిపించింది. ఆ మధ్య నాగబాబు వదిలి వెళ్లిన సీటును భర్తీ చేసేందుకు అప్పట్లో నానా పాట్లు పడ్డారు. అందులో భాగంగా ఒకటి రెండు ఎపిసోడ్లకు సంగీతను తీసుకొచ్చారు. వచ్చిన ఆ రెండు ఎపిసోడ్‌లలో సంగీతను ఓ రేంజ్‌లో మోసేశారు. అలా సంగీతకు కొన్ని ఈవెంట్లలోనూ స్పెషల్ ప్లేస్‌ను ఇచ్చారు. మొత్తానికి సంగీతకు మాత్రం బుల్లితెరపై మంచి క్రేజ్ ఉందని మరోసారి నిరూపించుకుంది.

ఇప్పుడు సంగీత పలు షోలతో బిజీగా ఉంది. త్వరలో ప్రారంభం కాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ సంగీత మెరవనుంది. ఇప్పుడు ఢీ షోలోనూ సంగీత రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ప్రియమణి ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందుకే ఆమె స్థానంలో సంగీతను కూర్చోబెట్టారు. గత రెండు వారాలుగా సంగీతనే ఆ సీటులో కూర్చుంది. తన స్థానాన్నిఅలా పదిలం చేసుకునేందుకు సంగీత కూడా బాగానే ట్రై చేస్తోంది.

ఒంపు సొంపులను తిప్పేసిన సంగీత..
సంగీత మంచి డ్యాన్సర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖడ్గం సినిమాలో అహ అల్లరి అల్లరి చూపులు అనే పాట ఎప్పటికీ నిలిచిపోతుంది. అందులో సంగీత ఇచ్చిన హావభావాలు, తిప్పిన నడుము ఒంపులు ఇప్పటికీ హైలెట్. అలాంటి పర్ఫామెన్స్‌ను తాజాగా సంగీత ఇచ్చింది. ఢీ స్టేజ్ మీద సంగీత చేసిన ఈ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. వచ్చే వారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో సంగీత తన డ్యాన్స్‌తో అందరినీ కట్టిపడేసేలా ఉంది. ప్రస్తుతం సంగీత డ్యాన్స్ చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Advertisement