Samyukta Menon : ఒక్కసారిగా సైలెంట్ అయిన సంయుక్త మీనన్‌.. ఏం జరిగింది?

NQ Staff - June 7, 2023 / 11:33 PM IST

Samyukta Menon : ఒక్కసారిగా సైలెంట్ అయిన సంయుక్త మీనన్‌.. ఏం జరిగింది?

Samyukta Menon : సంయుక్త మీనన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారా లో కూడా సంయుక్త మీనన్ నటించిన ఈమె ధనుష్ కి జోడిగా నటించిన సార్ చిత్రం కూడా సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

దాంతో సంయుక్త మీనన్ ను లక్కీ హీరోయిన్ అంటూ అంతా కీర్తించారు. ఆ సమయంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా విరూపాక్ష నిలిచింది. విరూపాక్షతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ సంయుక్త మీనన్ ను అంతా ప్రశంసించడం మొదలు పెట్టారు.

100 కోట్ల సినిమా వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉండదు. కానీ సంయుక్త మీనన్ మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాకి కమిట్ అయిన దాఖలాలు కనిపించడం లేదు. విరూపాక్ష సినిమా సక్సెస్ ఆమెకు సంతోషాన్ని కలిగించింది.. కానీ అవకాశాలు కల్పించలేక పోయింది అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

సంయుక్తా మీనన్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కమిట్ అయింది. కానీ స్టార్ హీరోయిన్గా వెలుగు వెలగాలంటే మాత్రం స్టార్ హీరోలతో మాత్రమే నటించాల్సిన అవసరం ఉంటుంది. మరి సంయుక్త కి స్టార్స్ నుండి పిలుపు వస్తుందా లేదా చూడాలి, ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న సంయుక్త త్వరలో సందడి చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us