Samantha: సమంత చైతు విడాకులు కన్ఫాం.. అక్కినేని ఫ్యామిలీ భరణం ఎంత ఇవ్వనుందో తెలుసా?

Samantha: ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశాలలో నాగ చైతన్య సమంత విడాకుల విషయం ఒకటి. మీడియాలో వారిద్దరి మ్యారేజ్ బ్రేకప్ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తమ బ్రేకప్ గురించి సమంత పరోక్షంగా హింట్స్ ఇస్తున్నప్పటికీ.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నది.

Samantha's Alimony amount Revealed
Samantha’s Alimony amount Revealed

చై- సామ్ నడుమ అభిప్రాయ భేదాలు తలెత్తాయని, వాళ్లిద్దరూ విడిపోయేందుకు రెడీ అయ్యారనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇలాంటి వార్తలపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ స్పందించకపోవడం జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది.

నాగ చైతన్య‌తో దాంపత్య జీవితం సానుకూలంగా సాగుతున్నదని అనుకొంటున్న సమయంలో ఉన్నట్టుండి తన ఇంటి పేరు నుంచి అక్కినేనిని సమంత తొలగించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఏదో జరుగుతున్నదనే అనుమానాలు వెంటనే బలపడ్డాయి. బయట జోరుగా ప్రచారాలు చేస్తున్నా కూడా ఇద్దరిలో ఒక్కరు కూడా స్పందించకపోయే సరికి వార్తలపై మరింత అనుమానం కలుగుతుంది.

పెళ్లి తర్వాత హాట్ హాట్ ఫోటోషూట్స్, సినిమాల్లో గ్లామరస్ రోల్స్, అందాల ఆరబోతకు పాల్పడటం అక్కినేని ఫ్యామిలీకి రుచించలేదట. దాంతో ఆమెకు పలుమార్లు సర్ది చెప్పిన ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడం సమంతపై ఆగ్రహానికి కారణమైందట. సమంత తన పంథానే కొనసాగించడంతో చైతూతో గ్యాప్ పెరిగిపోయిందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి . ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రంలో బోల్డ్ రోల్ వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.

ఫ్యామిలీ కోర్టులో సమంత, నాగ చైతన్యకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారని, ఆ తర్వాత కూడా వారిద్దరు కూడా విడిపోవడానికి మొగ్గు చూపారు. దాంతో వారి జీవితంలో విడాకులు తప్పనిసరి అయ్యాయి. డైవోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి అవుతుంది అని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇక డైవోర్స్ తీసుకొన్నందున్న అక్కినేని కుటుంబం దాదాపు 50 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. అవి ఆస్తులు, నగదు రూపంలో ఇవ్వడానికి సానుకూలంగా ఉంది