Samantha: న‌య‌న‌తార‌తో స‌మంత సెల‌బ్రేష‌న్స్.. ఎందుకో తెలుసా?

Samantha: అక్కినేని కోడ‌లు స‌మంత పెళ్లైన త‌ర్వాత కూడా కెరీర్‌లో దూసుకుపోతుంది. ఒక‌వైపు సినిమాలు,మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ సవాల్ విసురుతుంది. కుర్ర భామ‌లు కూడా స‌మంత డెడికేష‌న్‌తో పాటు ఆమె చేస్తున్న సినిమాలు చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌స్తుతం శాకుంత‌లం అనే పీరియాడిక‌ల్ చిత్రంలో స‌మంత న‌టించ‌గా, ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. మ‌రోవైపు ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది.

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన స‌మంత‌.. ఈ సిరీస్‌లో లైంగిక వివక్షకు గురైన రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో నటించింది. స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి.. పలు బోల్డ్ సీన్లలో, యాక్షన్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఇందుకుగాను ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్‌బోర్న్‌-2021లో ఆమెకు ఉత్తమ నటిగా ప్ర‌క‌టించారు.

ప్రతిష్టాత్మాక ఐఎఫ్ఎఫ్ ఎం అవార్డు గెలుచుకున్న సమంతపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా సమంత ‘కాత్తువకుల రెండు కాదల్’ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స‌మంత‌కు అవార్డ్ వ‌చ్చిన నేప‌థ్యంలో సెట్స్ లో నయనతార, విజయ్ సేతుపతి, విగ్నేష్ సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.

స‌మంత‌చిత్ర యూనిట్ తో పాటు మరికొందరితో సమంత ఆగార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. సెట్స్‌లో జ‌రిగిన ఫ‌న్నీమూమెంట్స్‌కి సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేసింది.

‘జాను’తో పరాజయాన్ని చవి చూసిన సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా నటిస్తోంది.