Samantha : నాగచైతన్య ప్లేస్ లో మరో హీరో.. రివేంజ్ తీర్చుకుంటున్న సమంత..!
NQ Staff - May 27, 2023 / 02:18 PM IST

Samantha : నాగచైతన్య, సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎక్కడ ఎవరు మాట్లాడినా సరే ఒకరి వ్యాఖ్యలను మరొకరికి ఆపాదిస్తూ ఉంటారు నెటిజన్లు. తాజాగా సమంత చేస్తున్న పనిని నాగచైతన్యతో పోలుస్తున్నారు.
వీరిద్దరూ విడిపోక ముందు వీరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. మజిలీ సినిమా తెరకెక్కుతున్న సమయంలోనే నందనిరెడ్డి వీరిద్దరూ జంటగా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకుందంట. ఆ సమయంలోనే ఇద్దరికి కథ చెప్పి ఓకే కూడా చేయించుకుంది. కానీ ఆమె సినిమా సెట్స్ మీదకు రాకముందే ఇద్దరూ విడిపోయారు.
దాంతో నందనిరెడ్డి ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ కథ ఆమెకు బాగా నచ్చడంతో ఎలాగైనా సినిమా తీయాలని చూస్తోంది. రీసెంట్ గా ఆమె దర్శకత్వంలో వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమా ప్లాప్ అయింది. దాంతో ఆమె ఆశలు మొత్తం సమంత మీదనే పెట్టుకుంది. అయితే నాగచైతన్య ప్లేస్ లో ఏ హీరోను తీసుకోవాలా అని ఆలోచిస్తోందంట.

Samantha Will Movie Directed By Nandini Reddy
ఈ క్రమంలోనే యంగ్ హీరో నాగశౌర్యను తీసుకోవాలని భావిస్తోంది. అతనితో నందిని రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఆ హీరో అయితే సమంత కూడా ఓకే చెప్పిందంట. చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.