Samantha : సౌత్ ఇండస్ట్రీలో సమంతనే నెంబర్ వన్.. ఇదిగో సాక్ష్యం..!
NQ Staff - June 13, 2023 / 12:55 PM IST

Samantha : ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ ఎవరు అనగానే అందరూ టక్కున నయనతార పేరు చెప్పేవారు. ఎందుకంటే ఆమె మాత్రమే అందరికన్నా ఎక్కువ సినిమాలు చేసింది. మిగతా హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది. ఆమె తర్వాత స్థానంలో సమంత ఉండేది.
కానీ ఇప్పుడు నయనతార ప్లేస్ ను కొట్టేసింది సమంత. అవునండి బాబు. ఎందుకంటే ఆమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంది. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే కలిసి తెరకెక్కిస్తున్నారు. విడాకుల తర్వాత సమంత ఏకంగా బాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.
రోజు రోజుకూ ఆమె స్టార్ స్టేటస్ పెరుగుతూనే ఉంది. ఇక సిటాడెల్ కోసం ఆమె ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇప్పటి వరకు నయనతార రూ.8 కోట్లు మాత్రమే తీసుకుంది.

Samantha Will Get Remuneration Of Rs 10 Crore For Citadel
ఇప్పుడు ఆమెను మించి పోయి సమంత రెమ్యునరేషన్ తీసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆమె మరింత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కోలీవుడ్ లో కూడా ఓ సినిమాను ఓకే చేసింది.