Samantha: కోర్టులో ప్ర‌త్య‌క్షం అయిన స‌మంత‌.. ఆ మూడు ఛానెల్స్‌పై ప‌రువు న‌ష్టం దావా

Samantha: టాలీవుడ్ మోస్ట ల‌వ‌బుల్ కపుల్‌గా ఉన్న స‌మంత‌- నాగ చైత‌న్య జంట కొద్ది రోజుల క్రితం అఫీషియ‌ల్‌గా విడిపోయిన విష‌యం తెలిసిందే. సామ్‌, చై నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమంత తన విడాకుల విషయం ప్రకటించినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, రూమర్స్‌ వస్తున్నాయి.

TheNewsQube-
Samantha Went to Kukatpally Court on Youtube Channels
Samantha Went to Kukatpally Court on Youtube Channels

ఈ క్రమంలో తన పరువు ప్రతిష్టలను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ చానల్స్‌పై సమంత కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు.

కానీ సోషల్ మీడియాలో అవేమీ పట్టించుకోకుండా సామ్ పై నెగెటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సామ్ ఇన్స్టా పోస్ట్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇలా చేస్తే ఊరుకోబోయేది లేదని హెచ్చరించింది కూడా.

తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు.

స‌మంత పిటీష‌న్ దాఖ‌లు చేసిన వాటిలో సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ ఉన్నాయి. కాసేపట్లో కూకట్ పల్లి కోర్టులో దీనిపై విచారణ జరగనుంది. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్లో నిజానిజాలు తెలియ‌కుండా అస‌త్య ప్ర‌చారం చేశార‌ని స‌మంత త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.