Samantha : ట్రెండీవేర్ దుస్తుల‌లో మెరిసిపోయిన స‌మంత‌.. క్యూట్ స్మైల్‌కి అంతా ఫిదా

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌ ప్ర‌స్తుతం మంచి స్పీడ్ మీదుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా సినిమాలు చేస్తుంది. మ‌రోవైపు తొలిసారిగా స్పెషల్‌సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలానే సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తుంది.

Samantha trendy and super cute look
Samantha trendy and super cute look

పూర్తిగా కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన స‌మంత స్పెష‌ల్ సాంగ్‌కి ఒప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. స్పెషల్ సాంగ్ కు హీరోయిన్ కు కోటి రూపాయలు ఇచ్చిన దాఖలాలు గతంలో వున్నాయి. కానీ ఈసారి కోటి కాదు. దగ్గర దగ్గర రెండు కోట్లు సమంత పాట కోసం ఖర్చు చేస్తున్నారు.

Samantha trendy and super cute look
Samantha trendy and super cute look

సమంతకు అన్నీ కలిపి కోటి డెభై అయిదు లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంక ఇవి కాక, అదనపు ఖర్చులు, జీఎస్టీలు వగైరా ఎలాగూ వుంటాయి. అన్నీ కలిపి రెండు కోట్లకు చేరిపోతుంది. కేవలం నాలుగు రోజుల వర్క్. సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఉదాహరణ.

Samantha trendy and super cute look
Samantha trendy and super cute look

మరోవైపు స‌మంత సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తుంది. మై మామ్ సెడ్ అంటూ ప‌లు క్యాప్ష‌న్స్ జోడిస్తూనే మ‌రోవైపు అందాల ఆర‌బోత చేస్తుంది. తాజాగా స‌మంత షేర్ చేసిన క్యూట్ పిక్స్ నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతున్నాయి.

ఇక ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో ఫుల్‌ బిజీగా ఉన్న సమంత త్వరలోనే బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో సైతం సందడి చేయనున్నట్లు సమాచారం.