Samantha : బాలీవుడ్‌ స్టార్స్ ని కూడా వెనక్కి నెట్టి నెం.1 గా నిలిచిన సమంత

NQ Staff - September 22, 2022 / 08:48 AM IST

Samantha : బాలీవుడ్‌ స్టార్స్ ని కూడా వెనక్కి నెట్టి నెం.1 గా నిలిచిన సమంత

Samantha : ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్‌ ప్రతి నెలా కూడా సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీ ల యొక్క టాప్ టెన్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాల్లో ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా ఉండే సెలబ్రిటీల యొక్క జాబితాను వీళ్ళు రిలీజ్ చేస్తుంటారు.

Samantha Top Place in Ormax Media

Samantha Top Place in Ormax Media

తాజాగా ఆగస్టు నెలలో అత్యధికంగా చర్చించబడ్డ హీరోయిన్స్ కి సంబంధించిన జాబితాను విడుదల చేయడం జరిగింది. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ ఆగస్టు 2022 అంటూ ఈ జాబితాను జనాల ముందుకు సదరు మీడియా సంస్థ తీసుకు వచ్చింది. ఇందులో షాకింగ్ గా నెంబర్ వన్ స్థానంలో సమంత నిలిచింది. ఈ మధ్య కాలంలో ఆమె విడాకులు మరియు ఇతరత్రా విషయాల గురించి ఎప్పుడూ మీడియాలో ఉంటూ వస్తుంది, ఆమె గురించి సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అందుకే ఆమెకి నెంబర్ 1 స్థానం వచ్చినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెంబర్ 2 స్థానంలో ఆలియా భట్ నిలిచింది. ఆమె బ్రహ్మాస్త్ర సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది, కనుక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది.

ఇక తర్వాత స్థానాల్లో నిలిచిన వారి విషయానికి వస్తే.. నెంబర్ 3 నయనతార, నెంబర్ 4 కాజల్ అగర్వాల్, నెంబర్ 5 దీపికా పడుకొనే, నెంబర్ 6 రష్మిక మందన, నెంబర్ 7 కీర్తి సురేష్, నెంబర్ 8 కత్రినా కైఫ్, నెంబర్ 9 పూజా హెగ్డే, నెంబర్ 10 అనుష్క శెట్టి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వచ్చేనెల జాబితాలో నెంబర్ 1 లో ఎవరు ఉంటారో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us