Samantha: ది డేరింగ్ లేడీ ఆఫ్ సౌత్ సినిమా అంటూ స‌మంత‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

Samantha: సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలు చేయడానికి ఆలోచిస్తారు. అలాంటిది హాట్ సీన్స్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించికోవాల్సిందే. అందులోనూ స్టార్ హీరోయిన్ ఇమేజ్.. ఒక పెద్దింటి కోడలు అయిన తర్వాత కూడా హాట్ సన్నివేశాల్లో నటించడం అనేది మామూలు విషయం కాదు. కానీ సమంత వీటన్నింటిని దాటేసింది. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి హద్దులు లేకుండా తాము చేయాలనుకున్న సినిమాలు, పాత్రలు చేస్తోంది. తాజాగా ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.

ఇందులో శ్రీలంక రెబల్ గా నటించింది సమంత అక్కినేని. ముందు నుంచి కూడా టెర్రరిస్ట్ పాత్ర అని వినిపించినా కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత అది సైనికురాలు పాత్ర అని అర్థమయిపోయింది. తమ హక్కుల కోసం పోరాడే పాత్ర ఇది. ఈ పాత్రపై ముందు నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కానీ సమంత మాత్రం అవేమి పట్టించుకోకుండా వెబ్ సిరీస్ చేసింది. ఇప్పుడు ఈమె నటనకు అవార్డులు కూడా రావడం ఖాయం అయిపోయింది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు రెండు మూడు చోట్ల హాట్ సీన్స్ కూడా చేసింది సమంత. బహుశా ఈమెకు తప్ప ఇప్పటి హీరోయిన్లలో ఇలాంటి గట్స్ మరెవరికీ లేవేమో.

ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు నూటికి నూరుశాతం తన పాత్రకు న్యాయం చేసింది సమంత. ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ కు ఇంత మంచి అప్లాజ్ వస్తుంది అంటే దానికి సమంత కూడా ప్రధాన కారణం. ఇవన్నీ చూసిన తర్వాత ఈమెను డేరింగ్ లేడీ ఆఫ్ సౌత్ సినిమా అంటున్నారు అభిమానులు. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తోంది సమంత అక్కినేని.