Samantha: ముక్కుకి ముక్కెర పెట్టిన స‌మంత‌.. నార్త్ స్టైల్‌లో అద‌ర‌గొట్టేసిందిగా…!

Samantha: విడాకుల త‌ర్వాత కూడా స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టూర్స్ ఇంకోవైపు సోష‌ల్ మీడియాలో సంద‌డి. ఇలా ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది స‌మంత‌. తాజాగా ఈ ముద్దుగుమ్మ నార్త్ స్టైల్‌లో రెడీ అయి అభిమానుల మ‌న‌సులు దోచేసింది. ముక్కుకు ముక్కెర పెట్టుకొని క్యూట్‌గా చీర‌క‌ట్టులో చాలా బాగుంది. ప్ర‌స్తుతం సామ్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

samantha tendy looks2
samantha tendy looks2

సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. కొన్నాళ్లకు నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

samantha tendy looks1
samantha tendy looks1

విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ఆది వైరల్ అవుతోంది. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం విడుద‌ల‌కి సిద్ధం కాగా, ఇక తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు.

samantha tendy looks
samantha tendy looks

ప్రోడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో స‌మంత న‌టిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. పూర్తి వివ‌రాలు త్వరలో వెల్ల‌డికానున్నాయి. ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు.