Samantha :  పాపం.. సమంత పీకపై కత్తి పెట్టినట్లు వారు వ్యవహరిస్తున్నారా?

NQ Staff - January 30, 2023 / 04:00 PM IST

Samantha :  పాపం.. సమంత పీకపై కత్తి పెట్టినట్లు వారు వ్యవహరిస్తున్నారా?

Samantha : మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న స్టార్ హీరోయిన్ సమంత మరి కొన్నాళ్లు పూర్తి విశ్రాంతిలో ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు మరియు సన్నిహితులు సూచిస్తున్నారు. కానీ ఆమె మాత్రం వెంటనే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది.

దాదాపు వారం నుండి పది రోజుల పాటు శాకుంతలం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత హాజరయ్యేందుకు ఒప్పందం చేసుకుందట. ఇప్పుడు ఆరోగ్యం బాలేకున్నా కూడా ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు వారం నుండి పది రోజుల పాటు సమంత హాజరు కావాల్సిందే అంటూ నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారట.

మరో వైపు శాకుంతలం సినిమా విడుదలైన వెంటనే తమ సినిమాని పూర్తి చేయాలని ఖుషి సినిమా యొక్క మేకర్స్ విజ్ఞప్తి చేస్తున్నారట. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. కాశ్మీర్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. సమంత ఆరోగ్యం సరిగా లేక పోవడంతో ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన ఖుషి సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

తాజాగా దర్శకుడు శివ నిర్వాన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అతి త్వరలోనే ఖుషి సినిమా యొక్క చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు. అంటే సమంతను ఆరోగ్యంతో సంబంధం లేకుండా పాల్గొనాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి సమంత పీక పై కత్తి పెట్టినట్లుగా ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకున్నా ఆమెతో సినిమాలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి కొన్ని నెలల పాటు సమంత విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సమంత షూటింగ్ లో తిరిగి జాయిన్ అయిన తర్వాత బ్రేక్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us